చంద్ర‌బాబు క‌న్నా.. అచ్చెన్న ప‌రిస్థితే న‌యం!

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాకా వివిధ స్కాముల్లో, వివాదాల్లో తెలుగుదేశం నేత‌లు ఎవ‌రైనా అరెస్టు అయితే వారికి ర‌మేష్ హాస్పిట‌ల్ కేరాఫ్ అయ్యేది. చంద్ర‌బాబు త‌ర‌హాలో ఒక స్కామ్ లో అరెస్టు అయిన తెలుగుదేశం నేత…

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాకా వివిధ స్కాముల్లో, వివాదాల్లో తెలుగుదేశం నేత‌లు ఎవ‌రైనా అరెస్టు అయితే వారికి ర‌మేష్ హాస్పిట‌ల్ కేరాఫ్ అయ్యేది. చంద్ర‌బాబు త‌ర‌హాలో ఒక స్కామ్ లో అరెస్టు అయిన తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు అయితే జైల్లో క‌నీసం ఒక్క రోజు కూడా గ‌డిపిన‌ట్టుగా లేరు!

అరెస్టు కాగానే.. అనారోగ్యం అన్నారు. ఒక్క రోజేమో జైల్లో గ‌డిపారు, ఆ వెంట‌నే కోర్టు ఆర్డ‌ర్ల‌తో ర‌మేష్ హాస్పిట‌ల్ చేరుకున్నారు! తెలుగుదేశం పార్టీకి బాగా అయిన వారికి సంబంధించిన ర‌మేష్ హాస్ప‌ట‌ల్ లో అచ్చెన్న కొన్నాళ్ల పాటు గ‌డిపారు! బెయిల్ వ‌చ్చేంత వ‌ర‌కూ ఆయ‌న ఆ హాస్పిట‌ల్ దాట‌లేదు!

ఒక్క‌సారి బెయిల్ వ‌చ్చిన వెంట‌నే.. హాస్పిట‌ల్ నుంచి ఇంటికి చ‌క్కాపోయారు! బెయిల్ వ‌చ్చే వ‌ర‌కూ అనారోగ్యం. బెయిల్ రాగానే.. ఆరోగ్య‌వంతుడై అచ్చెన్న త‌న ఇంటికి చేరుకున్నారు!

అచ్చెన్నే కాదు.. ఆ త‌ర్వాత ఒక‌రిద్ద‌రు టీడీపీ నేత‌లు కూడా అరెస్టు కాగానే ర‌మేష్ హాస్పిట‌ల్ కు వెళ్లిపోయారు కానీ, జైలుకు వెళ్ల‌లేదు! అయితే చంద్ర‌బాబు మాత్రం అలాంటి అవ‌కాశం ల‌భిస్తున్న‌ట్టుగా లేదు!

ర‌మేష్ హాస్పిట‌ల్ కు వెళ్ల‌డానికి ముందు ముందు అవ‌కాశం అడుగుతారో లేదో కానీ, ఇంటికి వెళ్లాల‌ని మాత్రం చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టు ను కోరారు. చంద్ర‌బాబు హౌస్ అరెస్టులో ఉంటార‌ని, బ‌య‌ట తిర‌గ‌ర‌ని, జైలు వ‌ద్ద‌ని వారు కోరినా ఏసీబీ న్యాయ‌స్థానం ఒప్పుకోలేదు. ఈ చ‌ట్టం ప్ర‌కారం.. అలాంటి ఆస్కారం లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 

అయినా.. చంద్ర‌బాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీపై విప‌రీత‌మైన సానుభూతి వ‌స్తోంద‌ని టీడీపీ వాళ్లు ప్ర‌చారం చేసుకుంటున్నారు! మ‌రి అలాంట‌ప్పుడు బెయిల్ ఎందుకు.. ఎంచ‌క్కా.. పోలింగ్ తేదీ వ‌ర‌కూ జైల్లోనే గ‌డిపితే మ‌రింత ప్ర‌యోజ‌నం ఉంటుందేమో!