ఎర్రన్నలకు జగన్ నచ్చడంలేదుట…!

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు నచ్చాడు. 151 సీట్లతో భారీ మెజారిటీని కట్టబెట్టారు. అధికారం అప్పగించారు. ఆనాడు కూడా జగన్ని విపక్షలు ఎవరూ నచ్చలేదు, మెచ్చలేదు. జగన్ ది ఒంటరి పోరాటమే. Advertisement ఇక…

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు నచ్చాడు. 151 సీట్లతో భారీ మెజారిటీని కట్టబెట్టారు. అధికారం అప్పగించారు. ఆనాడు కూడా జగన్ని విపక్షలు ఎవరూ నచ్చలేదు, మెచ్చలేదు. జగన్ ది ఒంటరి పోరాటమే.

ఇక ఏడు నెలల ముఖ్యమంత్రిగా కూడా జగన్ విపక్షాలకు నచ్చడంలేదు. ఆయన ఏ పని చేసినా విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. కుడి ఎడమల తేడా లేకుండా అటు బీజేపీ, ఇటు వామపక్షాలు కూడా జగన్ విషయంలో ఒక్కటి కావడం ఏపీ రాజకీయాల్లో చాలాకాలంగా చూస్తున్నదే.

విశాఖ వచ్చిన సీపీఎం నేత బీవీ రాఘవులుకు కూడా జగన్ పాలన అసలు నచ్చడంలేదుట. ఆయన మూడు రాజధానుల ప్రతిపాదన అంతకంటే నచ్చడంలేదుట. రాజధానులను ముక్కలు చేయడం ఏంటని రాఘవులు సూటిగానే అడుగుతున్నారు.

ఎక్కడో అధ్యక్ష తరహా పాలన ఉన్న దేశాల్లో మూడు రాజధానులు ఉన్నా గొడవ లేదు కానీ, పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న భారత్ లో ఆ ముచ్చట చెల్లదు అంటున్నారు రాఘవులు. జగన్ పాలనను వికేంద్రీకరించడం అంటే ఇది కాదు అని కూడా అనేశారు. విశాఖ టూర్లో జగన్ ఇక్కడ సమస్యలపై మాట్లాడకుండా వెళ్ళిపోవడం తనకు నిరాశ కలిగించిందని కూడా రాఘవులు అంటున్నారు.

విశాఖ నిజమైన అభివ్రుధ్ధి అంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడడం, అనేక విధాలుగా  అభివ్రుధ్ధి చేయడమేనని  అంటున్నారు.  మరి జగన్ కూడా అభివ్రుధ్ధి కోసమే రాజధానిని విశాఖ తెస్తామని అంటున్నా కామ్రెడ్ కి మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలట.

మొత్తానికి ఇదే వరసలో కొన్ని రోజులుగా  సీపీఐ నేత నారాయణ మాట్లాడుతున్నారు. రాజధాని అమరావతిలో ఉండాలని కూడా ఆయనా డిమాండ్ చేస్తున్నారు. ఇపుడు రాఘవులు కూడా అదే వినిపిస్తున్నారు.

బీజేపీ కన్నా లక్ష్మీ నారాయణ కూడా ఎర్రన్నల గొంతుకే వినిపిస్తున్నారు. చూడబోతే జగన్ మార్క్ పాలన విపక్షంగా చెప్పుకునే వారెవరికీ  నచ్చడంలేదు మరి. అయినా తీర్పు చెప్పేది జనం కదా.

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు నచ్చాడు. 151 సీట్లతో భారీ మెజారిటీని కట్టబెట్టారు. అధికారం అప్పగించారు. ఆనాడు కూడా జగన్ని విపక్షలు ఎవరూ నచ్చలేదు, మెచ్చలేదు. జగన్ ది ఒంటరి పోరాటమే.

విశాఖ మాత్రమే సరైన ఆలోచన