జగన్ సైలెంట్ గా సాధించేశారా…?

జగన్ ని ఇపుడు విజనరీ అంటున్నారు. ఆయనను సత్తా ఉన్నవారు అని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఏదైనా పని చేస్తే దానికి పదింతలు గొప్పలు చెప్పుకునేవారు. జగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తమ పని…

జగన్ ని ఇపుడు విజనరీ అంటున్నారు. ఆయనను సత్తా ఉన్నవారు అని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఏదైనా పని చేస్తే దానికి పదింతలు గొప్పలు చెప్పుకునేవారు. జగన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తమ పని ద్వారానే ప్రచారం చేయిస్తున్నారు. 

విశాఖలో పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ చేయించడం వెనక జగన్ వ్యూహం ఉంది. జగన్ తలచుకుంటే దీని మీద ప్రచారం కొండంతలు చేసుకోవచ్చు. కానీ వర్క్ జరగాలి. రిజల్ట్ కనిపించాలి. ఇదే ఆయన మార్క్ వర్కింగ్ స్టైల్ అంటున్నారు. ఈ పాటికి అది అందరికీ అర్ధమైంది. 

ఇలాంటిదే ఒకటి జగన్ చాలా కూల్ గా సైలెంట్ గా ఏపీకి సాధించారు. విశాఖ నుంచి భోగాపురం దాకా ఆరు లైన్ల రోడ్డుని జగన్ కేంద్రం నుంచి చాలా ఒడుపుగా సాధించారు. ఇందుకోసం కేంద్రం పెడుతున్న ఖర్చు కేటాయిస్తున్న మొత్తం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు. దీనితో విశాఖ విజయనగరం తీర ప్రాంతం దశ తీరిపోతుంది. బీచ్ టూరిజానికి పునాది పడుతుంది. 

కేంద్రంతో దేశంలోని అనేక రాష్ట్రాలు వివాదాలు పెట్టుకుంటూ చీటికీ మాటికీ పేచీలు పడుతూంటే జగన్ మాత్రం సయోధ్యతో కేంద్రంతో వ్యవహరిస్తూ ఏపీ అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. ఏపీ మొత్తానికి రోడ్లు మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ఇరవై వేల కోట్ల రూపాయలను కేటాయించింది అంటే అది జగన్ దౌత్య నీతి అని అంటున్నారు.

ఊరకే మాటలు చెప్పడం కాదు, అనుభవం ఉందని డప్పు కొట్టుకోవడం కాదు, కేంద్రంతో మంచిగా ఉంటూ ఏపీకి ఏమి తీసుకువచ్చారు అని అడుగుతున్న వారికి ఇలాంటి అనేక కార్యక్రమాలే ఉదాహరణ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

ఢిల్లీ వెళ్తారు వస్తారు, మీడియాకు కూడా ఏమీ చెప్పరని తెలుగుదేశం తరచూ విమర్శలు చేస్తూ వుంటుంది. కేంద్ర మంత్రులకు ఏమి చెప్పాలో అవి చెప్పి ఏపీకి నిధులను సైలెంట్ గా తెచ్చుకుంటున్న జగన్ కంటే విజనరీ ఉంటారా అన్నదే వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న.