చంద్రబాబు నాయుడి హయాంలో రిటైర్మెంట్ పేరుతో రమణ దీక్షితులును ఇంటికి పంపేయడం, ఆయనకు నాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసాను ఇవ్వడం తెలిసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్ఛకుల బాధ్యతల నుంచి రమణ దీక్షితులను తిప్పి పంపారు.
అయితే అర్చకులకు రిటైర్మెంట్ ఉండదని జగన్ ప్రభుత్వం వచ్చాకా అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలోని ఏ ఆలయంలో అయినా వంశపారంపర్యపు అర్చకులు జీవితాంతం దేవుడి సేవలో తరించడానికి ఇప్పుడు అవకాశం ఉంది. రమణ దీక్షితులకు అప్పుడు ఇచ్చిన భరోసా మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను టీటీడీలో మళ్లీ చేర్చింది. తిరుమలలో శ్రీవారి సేవా సంప్రదాయాల సలహాదారుగా ఆయనను నియమించింది జగన్ ప్రభుత్వం. ఆ హోదాలో ఉన్న రమణ దీక్షితులుకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత లభించింది.
ఆయనను ఆలయ గౌరవ ప్రధాన అర్ఛకులుగా నియమిస్తున్నట్టుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇది వరకూ ప్రధాన అర్చకులుగా హోదాలో వ్యవహరించిన ఆయన ఇప్పుడు గౌరవ ప్రధాన అర్చకులుగా నియమితం అయ్యారు. ఇలా రమణ దీక్షితులుకు మరింత ప్రాధాన్యత లభిస్తూ ఉంది.