హరిహర…సమ్మర్ కష్టం అంట

మిగిలిన సినిమాల షూటింగ్ ల సంగతేమో కానీ హరి హర వీరమల్లు సినిమా షూట్ మాత్రం సమ్మర్ లో చేయరట పవన్ కళ్యాణ్. కావాలంటే ఏప్రిల్ లో ఓ పది రోజలు చేస్తారట కానీ,…

మిగిలిన సినిమాల షూటింగ్ ల సంగతేమో కానీ హరి హర వీరమల్లు సినిమా షూట్ మాత్రం సమ్మర్ లో చేయరట పవన్ కళ్యాణ్. కావాలంటే ఏప్రిల్ లో ఓ పది రోజలు చేస్తారట కానీ, ఆ తరువాత సమ్మర్ ముగిసే వరకు దాని జోలికి మాత్రం వెళ్లరట. ఇదీ టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం.  

ప్రస్తుతం మూడు సినిమాలకు డేట్ ల అడ్జస్ట్ చేస్తున్న పవన్, హరి హర వీరమల్లు విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఆ పాత్రకు వాడుతున్న దుస్తులు, మేకప్ ఇతరత్రా వ్యవహారాలేనని తెలుస్తోంది.

వేసవి వేడిలో అంత హెవీ దుస్తులు, హెవీ మేకప్, ఇతరత్రా ప్రాపర్టీస్ వాడడం కష్టం అని పవన్ డిసైడ్ అయ్యారట. కావాలంటే ఏప్రిల్ లో ఓ వారం పది రోజులు ట్రయ్ చేస్తా అని, మే, జూన్ మాత్రం సమస్య లేదని దర్శకుడు క్రిష్ కు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్దగా కష్టం లేని పాత్రల వైపే చేస్తున్నారు. రోప్ ఫైట్ లు, పాటలు, ఇలాంటివి పెద్దగా ఇష్టపడడం లేదు. హరి హర వీరమల్లు స్క్రిప్ట్ ను అందుకే మార్చించారని గుసగుసలు వున్నాయి. ఓజి సినిమాలో ఒక్క పాట కూడా వుండదని టాక్ వుంది. మరో రీమేక్ లో ఒక్క పాట వుండే అవకాశం వుంది. తెరి రీమేక్ సంగతి మాత్రం ప్రస్తుతానికి తెలియదు.

జూలై తరువాత కానీ హరి హర వీరమల్లు షూట్ ఫైనల్ గా మొదలు పెట్టకపోతే ఈ ఏడాది విడుదల కష్టమే కావచ్చు.