మహేష్ బాబు భాగస్వామ్యంలో ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ నిర్మించి హైదరాబాద్ కే అట్రాక్షన్ అన్నట్లు తయారు చేసారు ఆసియన్ సంస్థల అధినేత సునీల్ నారంగ్. ఇప్పుడు అదే సంస్థ అల్లు అర్జున్ భాగస్వామ్యంతో అమీర్ పేట సత్యం థియేటర్ ను తీసుకుని ఎఎఎ (ఆసియన్ అల్లు అర్జున్)ను రెడీ చేసారు. దాదాపు వర్క్ పూర్తయింది. మరో రెండు మూడు నెలల్లో ఓపెనింగ్ కు రెడీ అవుతోంది.
ఈ థియేటర్ లో చాలా ప్రత్యేకతలు ఏర్పాటు చేస్తున్నారు. ఎఎంబి లో ఎమ్ లాంజ్ అని పెట్టినట్లుగా ఇక్కడ ఎఎ లాంజ్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది జస్ట్ లావిష్ సిటింగ్ ఏరియా మాదిరిగా కాకుండా, ఇంకా ఎంటర్ టైనింగ్ గా వుండేలా చూస్తున్నారు. అలాగే ఇక్కడ బన్నీ సినిమాల మర్చండైజర్, ఇతర వస్తువులు సేల్ కు లభించేలా ఏర్పాటు చేస్తారట.
చాలా భారీ ఖర్చుతో అల్లు అర్జున్ వర్చ్యువల్ ఇమేజ్ ను ఏర్పాటు చేస్తున్నారట. దీని ముందు నిల్చుని ఎవరు ఎలా చేస్తే ఆ ఇమేజ్ అలా రియాక్ట్ అవుతుందట.
రెగ్యులర్ స్క్రీన్ లతో పాటు శ్యామ్ సంగ్ నుంచి ఓ భారీ టీవీ స్క్రీన్ ను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దాని వల్ల ప్రొజెక్టర్ అవసరం లేకుండా సినిమా వేసుకోవచ్చు. క్లారిటీ కూడా బాగుంటుందట.
మొత్తం మీద బన్నీ తన భాగస్వామ్యంలో థియేటర్ ఎఎంబి ని మించి పాపులర్ చేయాలని చూస్తున్నట్లు వుంది.