నాని సినిమా డిజిటల్ రైట్స్ 35 కోట్లు

సివిఎమ్ నిర్మాతగా కొత్త దర్శకుడితో హీరో నాని ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. 35 కోట్ల రూపాయలు కేవలం డిజిటల్ హక్కుల రూపంలోనే వచ్చాయని తెలుస్తోంది.  Advertisement…

సివిఎమ్ నిర్మాతగా కొత్త దర్శకుడితో హీరో నాని ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. 35 కోట్ల రూపాయలు కేవలం డిజిటల్ హక్కుల రూపంలోనే వచ్చాయని తెలుస్తోంది. 

ఈ లెక్కన హిందీ, శాటిలైట్, అడియో హక్కులు అన్నీ కలిస్తే 70 వరకు నాన్ థియేటర్ రాబడి వుంటుందని తెలుస్తోంది. థియేటర్ మీద కనీసం మరో ముఫై కోట్లు రాబడితే వంద కోట్ల మూవీ అవుతుంది.

దసరా సినిమాకు నాన్ థియేటర్ 60 కోట్ల వరకు వచ్చింది. థియేటర్ ఆదాయం 30 కోట్ల వరకు వచ్చింది. అయితే హిందీ నేరుగా విడుదల చేయడం వల్ల ఈ ఆదాయం పది కోట్లకు పైగా తగ్గింది.

సివిఎమ్ నిర్మాతగా చేస్తున్న సినిమాకు వంద కోట్ల మార్కెట్ రావడంతో నాని 22 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ సర్కిళ్ల భోగట్టా. నాన్ థియేటర్ ఆదాయం పెరుగుతున్న కొద్దీ హీరోల రెమ్యూనిరేషన్లు అంతకు అంతా పెరుగుతున్నాయి.