డ్యాంగ్..డ్యాంగ్..తమన్నా ఊపేసిందిగా

తమన్నా ఐటమ్ సాంగ్ లు మామూలుగా చేయదు. డ్యాన్స్ ఊపేస్తుంది. మళ్లీ అదే పని చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'బ్యాంగ్.బ్యాంగ్' అంటూ చేసిన డ్యాన్స్ నెంబర్ బయటకు వచ్చింది. Advertisement మ్యూజిక్ డైరక్టర్…

తమన్నా ఐటమ్ సాంగ్ లు మామూలుగా చేయదు. డ్యాన్స్ ఊపేస్తుంది. మళ్లీ అదే పని చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'బ్యాంగ్.బ్యాంగ్' అంటూ చేసిన డ్యాన్స్ నెంబర్ బయటకు వచ్చింది.

మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఫామ్ లో లేడు అన్న సంగతి ఇప్పటికే అందరికీ అర్థం అయిపోయింది. ఎవరికి బాధ అనిపించినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందుకు ఈ పాట కూడా నిదర్శనం. 

గతంలో దేవీ చేసిన అయిటమ్ సాంగ్ లతో పోల్చుకుంటే ఈ పాట వాటి ముందు నిలబడదు. అయితే ఈ పాటకు వచ్చే కలర్ ఏమిటంటే తమన్నా డ్యాన్స్, ఆమెతో పాటు మహేష్ కూడా డ్యాన్స్ చేయడం.

ఇటీవల కొంత కాలంగా మహేష్ డ్యాన్స్ చేయడం అరుదుగా మారింది. అందువల్ల ఈ పాటలో మహేష్ కాస్త గట్టిగానే స్టెప్పులు వేయడం పాటకు అందం తీసుకువచ్చింది. 

సరిలేరులో పాటలు అన్నీ దాదాపు బయటకు వచ్చాయి. మాస్ లోకి వెళ్లే పాటల్లో 'మైండ్ బ్లాంక్' పాట ముందు వుంటుంది. రష్మిక డ్యాన్స్ తో 'హి ఈజ్ సో హాట్' పాట, అలాగే తమన్నా మహేష్ డ్యాన్స్ లతో ' డ్యాంగ్…డ్యాంగ్' పాట నిల్చునే అవకాశం వుంది.