అయిటమ్ సాంగ్ వచ్చేస్తోంది

అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమాలో మాస్ అస్త్రం అనుకోవాల్సింది తమన్నా అయిటమ్ సాంగ్. ఇప్పటివరకు తమన్నా చేసిన అయిటమ్ సాంగ్ లు అన్నీ హిట్ నే. Advertisement లాస్ట్ గా 'స్వింగ్ జరా..స్వింగ్ జరా'…

అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమాలో మాస్ అస్త్రం అనుకోవాల్సింది తమన్నా అయిటమ్ సాంగ్. ఇప్పటివరకు తమన్నా చేసిన అయిటమ్ సాంగ్ లు అన్నీ హిట్ నే.

లాస్ట్ గా 'స్వింగ్ జరా..స్వింగ్ జరా' అంటూ జై లవకుశలో ఆమె తిరిగిన మెలికలు ఇంకా మాస్ జనాల కళ్ల ముందు వున్నాయి. ఇప్పుడు 'డాంగ్..డాంగ్' అంటూ సరిలేరు నీకెవ్వరులో అయిటమ్ సాంగ్ చేస్తోంది.

మిలటరీ జవానుల ఫేర్ వెల్ పార్టీలో సాంగ్ ఇది. దేవీశ్రీప్రసాద్ అయిటమ్ సాంగ్ ల స్పెషలిస్ట్. ఆయన జాబితాలో హిట్ అయిటమ్ సాంగ్ లు చాలానే వున్నాయి.

సరిలేరు నీకెవ్వరు సినిమా అడియో మీద విపరీతమైన క్రిటిసిజమ్ వచ్చింది. ముఖ్యంగా అలవైకుంఠపురములో సాంగ్స్ పెద్ద హిట్ కావడంతో సరిలేరు పాటల మీద ఆ ప్రభావం పడింది.

అయితే మాస్ బీట్ అయిన 'మైండ్ బ్లాంక్' సాంగ్ జనాల్లోకి బాగానే వెళ్లింది. టిక్ టాక్ లో ఆ పాట హుక్ లైన్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ అయిటమ్ సాంగ్ కనుక బాగుంటే దేవీ పాసయిపోతాడు. సినిమాకు ఒక్కసాంగ్ బ్లాక్ బస్టర్ అయినా చాలు.

ఈ పార్టీ సాంగ్ 'డాంగ్..డాంగ్..' ను దేవీ మాంచి మాస్ బీట్ తో కంపోజ్ చేసినట్లు బోగట్టా. ఈ పాట ఈ సాయంత్రం విడుదల కాబోతోంది.