చంద్రబాబు.. అంత సీన్ వుందా?

చంద్రబాబు యధాలాపంగా అన్నారా? లేక నిజంగా అధికారుల్లో వుండే తెలుగుదేశం అభిమానుల నుంచి సమాచారం ఏదైనా అందిందా? తనను అరెస్ట్ చేసే అవకాశం వుందని చంద్రబాబు కొద్ది రోజులు ముందే బాహాటంగా చెప్పారు. ఇది…

చంద్రబాబు యధాలాపంగా అన్నారా? లేక నిజంగా అధికారుల్లో వుండే తెలుగుదేశం అభిమానుల నుంచి సమాచారం ఏదైనా అందిందా? తనను అరెస్ట్ చేసే అవకాశం వుందని చంద్రబాబు కొద్ది రోజులు ముందే బాహాటంగా చెప్పారు. ఇది జస్ట్ ఓ మాటగా అన్నారా? లేక నిజంగా సమాచారం వుందా? అలా సమాచారం వుండి వుంటే చంద్రబాబు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోకుండా ఎందుకు వుంటారు? లేదా ఎందుకు వున్నారు?

లీగల్ ప్రోసీజర్ ల్లో చంద్రబాబు ను కొట్టేవారు లేరు. గత నాలుగేళ్లుగా పోరాటాల ద్వారా కన్నా లీగల్ గానే జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ముప్పు తిప్పలు పెడుతోంది అంటే కేవలం ఈ లీగల్ ప్రొసీజర్లతోనే తప్ప మరోటి కాదు. మరి అలాంటపుడు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకోలేదు.

దీనికి రెండు కారణాలు. ఒకటి తేదేపా, దాని అనుకూల వర్గాలు చెబుతున్నది. రెండు వైకాపా వర్గాలు చెబుతున్నవి.

తేదేపా వర్గాలు ఏమంటున్నాయి అంటే.. ఇది చంద్రబాబు ఎత్తుగడ. జనాల్లో సింపతీ వస్తుంది. అందుకే అరెస్ట్ చేసుకుంటే చేసుకోనీ అని వుండిపోయారు. లేదంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం బాబుగారికి ఎంతలో పని. ఇప్పుడు చూడండి ఎంత సింపతీ వచ్చిందో..అన్నది వారి మాట.

కానీ వైకాపా వర్గాలు వేరే చెబుతున్నాయి. అసలు ఈ విషయం జగన్ ప్రభుత్వంలో నెంబర్ టూ, త్రీ లెవెల్ లో వున్న వారికి కూడా తెలియదు. అంత క్లోజ్డ్ గా వుంచారు సమాచారం. బాబు మందుగా తనను అరెస్ట్ చేస్తారు అన్నది జస్ట్ రాజకీయ ప్రసంగాల్లో భాగంగా అన్నది తప్ప వేరు కాదు. నిజంగా సింపతీ కోసం ముందస్తు బెయిల్ తెచ్చుకోకుండా అరెస్ట్ అయ్యారు అన్నది నిజమైతే, బెయిల్ కోసం అంత హడావుడి చేయరు. కోట్లకు కోట్లు కేవలం బెయిల్ కోసం ఖర్చు చేయరు. అలాగే హవుస్ అరెస్ట్ కోసం పట్టుపట్టరు అన్నది వైకాపా జనాల కామెంట్.

ఈ రెండు విషయాలు పక్కన పెడితే, పార్టీ వర్గాలు అది కూడా ఓ లెవెల్ నాయకత్వం వరకు తప్పిస్తే, చంద్రబాబు అరెస్ట్ అన్నది జనాల్లోకి పెద్దగా కదిపేసేంత పాయింట్ గా వెళ్లలేదు అన్నది వాస్తవం. డిస్కషన్ పాయింట్ గా వెళ్లింది తప్ప, దీని మీద బేస్ చేసుకుని ఓటింగ్ ను డిసైడ్ చేసుకునేంత లేదు. పైగా జనం కూడా రోడ్లెక్కిపోయినంత లేదు అన్నది వాస్తవం. గ్రౌండ్ లెవెల్ లో తిరిగిన వారికి ఇది క్లారిటీగా కనిపిస్తోంది.

టికెట్ లు ప్రకటించే వరకు పార్టీ ప్రకటించే కార్యక్రమాలకు ఇంతో అంతో కష్టపడడం అన్నది కామన్. నిజంగా తెలుగుదేశం జనాలు రోడ్డెక్కి పోరాడేంత వుంటే గత నాలుగేళ్లలో ఇలానే పోరాడి వుండేవారు. కేవలం సింపతీ కోసమే ముందస్తు బెయిల్ తెచ్చుకోలేదు అన్నది జస్ట్ చంద్రబాబు విజనరీ అనే ప్రచారాన్ని కాపాడుకోవడం కోసం తప్ప వేరు కాదు. అదే నిజమైతే యువగళం క్యాన్సిల్ కొట్టరు. సింపతీ కోసం అదే అంశాన్ని పట్టుకుని జనాల్లోకి వెళ్లిపోతారు.

సింపుల్.. ఇది తెలుగుదేశం పార్టీ ఊహించని దెబ్బ.  దాన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలి అని అన్ని వైపుల నుంచి వార్తలు వండి వార్పిస్తున్నారు తప్ప మరోటి కాదు.