బాలయ్య ను నొక్కేసారు..తొక్కేసారు!

సినిమా రంగంలో ఓ మాట వినిపిస్తూ వుంటుంది.. టాలెంట్ ను తొక్కేసారు అని. సినిమా హీరో కనుక నందమూరి బాలయ్య విషయంలో కూడా అలాగే అనాలేమో? ఎందుకంటే నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఓ…

సినిమా రంగంలో ఓ మాట వినిపిస్తూ వుంటుంది.. టాలెంట్ ను తొక్కేసారు అని. సినిమా హీరో కనుక నందమూరి బాలయ్య విషయంలో కూడా అలాగే అనాలేమో? ఎందుకంటే నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఓ ఫొటో వచ్చింది. 

నందమూరి అభిమానులకు, నందమూరి బాలయ్య అభిమానులకు నచ్చిన ఫొటో. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలయ్య నాయకత్వంలో పార్టీ నాయకులు సమావేశమైన ఫొటో. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితిని, భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటైన సమావేశం అది.

ఇది బాలయ్య, నందమూరి అభిమానులకు భలే ఆనందం కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ పగ్గాలు బాలయ్య చేతిలో పెడితే బాగుంటుందని ఫీల్ అవుతూ వస్తోంది. కానీ బాహాటంగా దీని మీద మాట్లాడేంత అవకాశం లేదు. అందుకే ఇలాంటి డిస్కషన్లు జస్ట్ చిన్న చిన్నగా సోషల్ మీడియాలో కనిపిస్తూ వుంటాయి తప్ప సీరియస్ డిస్కషన్లు గా మారలేదు.అందుకే ఈ ఫొటో భలే వైరల్ అయింది.

కానీ గమ్మత్తుగా తెలుగుదేశం అనుకూల మీడియా కానీ, వాట్సాప్ గ్రూపులు కానీ ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. లోకేష్ మీద పెట్టిన దృష్టి. లోకేష్ కు ఇచ్చిన కవరేజ్, లోకేష్ నే ఈ క్రైసిస్ టైమ్ లో అసలు సిసలు లీడర్ గా చూపించే ప్రయత్నం తప్ప మరోటి కనపడలేేదు. లోకేష్ ను తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్  చేసే అజెండాలో భాగంగానే బాలయ్య సమావేశాన్ని, ఫొటోని తొక్కేసారని అనుకోవాలేమో?