గత నెల రోజులుగా ఒకటే గడబిడ. పవర్ స్టార్ భీమ్లా నాయక్ డేట్ మీద. దాన్ని వెనక్కు పంపాలని ఒకటే కసరత్తు. ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ ను కలిసారు. అలాగే పవన్ అపాయింట్ మెంట్ కోసం ట్రయ్ చేసారు. రాజమౌళి అయితే వీలయినంతగా త్రివిక్రమ్ తో టచ్ లోకి వెళ్లిపోయారు.
అంతా అయింది. సినిమా వాయిదా పడిపోయింది. కానీ రాజమౌళి ట్వీట్ లు చూస్తే చిత్రంగా వున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఐడి ని టాగ్ చేసి మరీ థాంక్స్ చెప్పారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు. కానీ నిజానికి సర్కారువారి పాట వెనక్కు వెళ్లింది ఆర్ఆర్ఆర్ కోసం కాదు. ఆ సినిమా వర్క్ పూర్తి కాక. ఇంకా మరో ముపై రోజుల షూట్ వుంది ఆ సినిమాకు అని టాక్. కానీ రాజమౌళి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు
కానీ పవన్ విషయానికి వచ్చేసరికి ఆయన పేరు పేర్కొని వదిలేసారు కానీ ఆయన ట్విట్టర్ అక్కౌట్ ను టాగ్ చేయలేదు. పైగా అక్కడికి చినబాబు అండ్ కో వాళ్లంతట వాళ్లే నిర్ణయం తీసుకుని వెనక్కు వెళ్లినట్లుంది రాజమౌళి ట్వీట్. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కు మండుతోంది సితార బ్యానర్ మీద. ఏదో ముగ్గురు పెద్ద హీరోల రెండు సినిమాల కోసం రిక్వెస్ట్ చేస్తే వెనక్కు వెళ్లారని కాస్త సంతృప్తిగా వున్నారు.
కానీ వాళ్లంతట వాళ్లే వెనక్కు వెళ్లినట్లు రాజమౌళి ట్వీటడం వాళ్లను మరింత మండిస్తుంది.