నిర్మాతకు షాక్ ఇస్తున్న హీరోలు?

హీరో నాని తన నిర్మాతకు షాక్ ఇచ్చారా? నాని కోట్ చేసిన రెమ్యూనిరేషన్ అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వలేదు నిర్మాతకు అని గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. విషయం ఏమిటంటే టాలీవుడ్ హీరొలు చాలా…

హీరో నాని తన నిర్మాతకు షాక్ ఇచ్చారా? నాని కోట్ చేసిన రెమ్యూనిరేషన్ అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వలేదు నిర్మాతకు అని గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో. విషయం ఏమిటంటే టాలీవుడ్ హీరొలు చాలా మంది ముందుగా రెమ్యూనిరేషన్ కోట్ చేయరు. సినిమా ఓకె చేస్తారు. టెంటటివ్ గా ఓ అమౌంట్ అనుకుంటారు. ఫైనల్ అమౌంట్ అన్నది సినిమా దాదాపు పూర్తి కావచ్చినపుడో, ప్రొడక్షన్ మీద ఓ క్లారిటీ వచ్చినపుడో చెబుతారు. ఈ విషయంలో ఒక్కో హీరోది ఒక్కో తరహా.

మహేష్ బాబు సినిమా బిజినెస్ ను బట్టి రెమ్యూనిరేషన్ చెబుతారని టాక్. బాలకృష్ణ ముందుగా ఓ రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసి, సినిమా విడుదల టైమ్ కు రెండు మూడు కోట్లు అదనంగా తీసుకుంటారు. ఆ వేళకు వున్న మార్కెట్ ను బట్టి ఇది వుంటుంది. రవితేజ తన సినిమాలను బట్టి సినిమా సినిమాకు పెంచుతూ వెళ్తారు.

ఈ మధ్య పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న నిర్మాతకు ఇలాంటి షాక్ నే తగిలిందని బోగట్టా. ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న లెక్కల ప్రకారం 50 కోట్ల రేంజ్ లో వుంటుంది పవన్ పారితోషికం అనుకున్నారు. కానీ తీరా చేస్తే 75 కోట్లు కోట్ చేసేసరికి షాక్ అయ్యారని తెలుస్తోంది. ఇక తప్పక ముందుకు వెళ్తున్నారు.

హీరో నాని కూడా ఇలాంటి షాక్ నే ఇచ్చారట ఓ నిర్మాతకు. తక్కువలో అయిపోతుంది. మరీ ఎక్కువ ఖర్చు లేని సినిమా. అందువల్ల రెమ్యూనిరేషన్ 22 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇరవై రెండు కోట్ల దగ్గర బేరాలు సాగుతున్నాయి.

ప్రభాస్ ఓ సినిమాకు 45 కోట్లు అడ్వాన్స్ తీసుకుని, ఆ నిర్మాత వెనకడుగు వేస్తే, అంత అమౌంట్ ఎవరు సింగిల్ పేమెంట్ ఇస్తే వారిని వెదికి పట్టుకుని, సినిమాను చేతిలో పెట్టేసారు. ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు తమ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చినా, వద్దు బాబూ…అనడం విశేషం.

హీరోలు ఇలా వుంటే డైరక్టర్లకు కూడా తక్కవ కాదు. ఓ సీనియర్ హీరోతో సినిమా చేస్తున్న ఓ ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ తన పారితోషికం కింది నైజాం, వైజాగ్ ఏరియాలు బ్లాక్ చేయమన్నారట. రెండూ కలిపితే దాదాపు 20 కోట్ల మేరకు వుంటుంది. రేట్లు తరువాత చూసుకుందాం అన్నారు కనుక నిర్మాత కు కాస్త ఊరట.

ఓ టాప్ డైరక్టర్ సినిమాలు సెట్ చేసి, స్క్రిప్ట్, డైలాగులు సాయం పడితేనే 15 కోట్లకు పైగా చార్జ్ చేస్తున్నారని వినిపిస్తోంది.

మొత్తం మీద కోవిడ్ తరువాత రెమ్యూనిరేషన్లు కాస్త షాకింగ్ గానే మారుతున్నాయి. చిన్న హీరో..లీస్ట్ అని అనుకుంటే నాలుగు కోట్లు కోట్ చేస్తున్నారు. కాస్త మార్కెట్ వుందీ అనుకుంటే 8 నుంచి పది అడుగుతున్నారని టాక్.