స్థానిక పోరు అభ్యర్థులు లేరు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. కొత్త ఏడాది నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే ధీమాగా ఉంది వైసీపీ. జగన్ ఏడు నెలల పాలన అంతా అధ్వాన్నంగా…

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. కొత్త ఏడాది నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎన్నికలపై ఇప్పటికే ధీమాగా ఉంది వైసీపీ. జగన్ ఏడు నెలల పాలన అంతా అధ్వాన్నంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్న టీడీపీకి మాత్రం అభ్యర్థులే కరువవుతున్నారు.

టీడీపీ నేతలు ఆరోపించినట్టు నిజంగానే జగన్ పాలన సరిగా లేకపోతే ప్రజలు టీడీపీకే పట్టం కడతారు. పట్టం కట్టే ఓటర్ల సంగతి పక్కన పెడితే, ముందు అభ్యర్థులే ఆ పార్టీకి దొరకడం లేదు. సంస్థాగత ఎన్నికలంటూ టీడీపీ ఇప్పటికే జిల్లాల్లో హడావిడి మొదలు పెట్టింది. స్థానిక ఎన్నికల సమయానికి పార్టీకి కాస్తో కూస్తో జవసత్వాలు కూడగట్టుకుందామనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకుంటోంది.

అయితే పార్టీ కమిటీల్లో కీలకంగా ఉంటామంటున్నారే తప్పితే.. ఎన్నికల్లో పోటీచేస్తామని మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదట. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బాగా ఖరీదైపోయిన నేపథ్యంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ఎవరు ఓడిపోతారంటూ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారట. ఈ లెక్కన చూస్తే టీడీపీకి స్థానిక ఎన్నికల్లో భారీ షాక్ తగలడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

వాస్తవానికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుబంధ సభ్యులు గెలిచినా చివరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే వారు మొగ్గు చూపుతారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రికార్డు మెజార్టీ సాధించిన వైసీపీకి.. ఈ స్థానిక ఎన్నికలు నల్లేరుపై నడకవంటివే. అయితే గ్రామాల్లో వర్గపోరు, స్థానికంగా ఉన్న సమస్యలు.. వంటివి కొంతవరకు ఈ ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు.

అందువల్లే అధికారంలో ఉన్న పార్టీ కూడా వీటిని అలసత్వం చేయదు. అయితే ఈ దఫా వైసీపీకి కలసొచ్చిన అంశం ఏంటంటే.. టీడీపీకి కానీ, ఇతర పార్టీలకు కానీ అభ్యర్థులే దొరకడంలేదు. టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాయకత్వ లేమితో అల్లాడిపోతోంది ఆ పార్టీ. అందుకే స్థానిక వార్ వన్ సైడేనని ముందే అర్థమవుతోంది. 

కూల్ బాబూ కూల్.. పేర్నినాని జోకులు                తప్పు మాట్లాడితే నా మీద మీ బూట్లు విసరండి