ఇంకా ఆ కాలం బ్రెయినే వాడుతున్నావా బాబూ!

తనది 40 ఇయర్స్ రాజకీయం అని చెప్పుకునే బాబు.. తన బ్రెయిన్ ను కూడా 40 ఏళ్ల కిందటే వదిలేసినట్టున్నారు. ఒకప్పుడంటే బాబు నంది అంటే నంది, పంది అంటే పంది. తన అను'కుల'…

తనది 40 ఇయర్స్ రాజకీయం అని చెప్పుకునే బాబు.. తన బ్రెయిన్ ను కూడా 40 ఏళ్ల కిందటే వదిలేసినట్టున్నారు. ఒకప్పుడంటే బాబు నంది అంటే నంది, పంది అంటే పంది. తన అను'కుల' మీడియా సహాయంతో బాబు ఆడని డ్రామా లేదు, రక్తికట్టించని నాటకం లేదు.

కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పటికీ అదే తరహా రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఆ విషయాన్ని గ్రహించని బాబు.. ఇప్పటికీ జమిలీ ఎన్నికలంటూ మభ్యపెట్టే రాజకీయం చేయాలని చూస్తున్నారు.

ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యారో ఆ క్షణం నుంచి చంద్రబాబు జమిలీ ఎన్నికల అంశాన్ని ఎత్తుకున్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని, ఏపీలో కూడా జగన్ సర్కార్ ఏ నిమిషమైనా రద్దవుతుందని, మళ్లీ ఎన్నికలు వస్తాయంటూ చెప్పిందే చెబుతూ వస్తున్నారు. ఇందులో లాజిక్ ఎంత.. ప్రాక్టికల్ గా సాధ్యమా అనే విషయాన్ని బాబు అస్సలు ఆలోచించడం లేదు. 

త్వరలోనే బిహార్ లో ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికలున్నాయి. అదే టైమ్ లో కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ లో కూడా ఎన్నికలొస్తున్నాయి. 

అక్కడ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన ఏడాదికే మళ్లీ ఎన్నికలంటే సాధ్యమయ్యే పనేనా. అసలు కొత్తగా వచ్చే ప్రభుత్వాలు దానికి అంగీకరిస్తాయా..? బాబు మాత్రం 2022లో గ్యారెంటీగా జమిలీ ఎన్నికలంటూ ఊదరగొడుతున్నారు. సమయం-సందర్భం లేకుండా ఒకే స్టేట్ మెంట్ పదే పదే ఇస్తున్నారు.

పోనీ.. బాబు చెప్పినట్టు కేంద్రం జమిలీకి సిద్ధమైందనే అనుకుందాం. అలా చేయాలంటే బీజేపీ పరిస్థితి బాగుండాలి కదా. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా దెబ్బతో పాటు వలసకార్మికుల విషయంలో బీజేపీ అనుసరించిన విధానం దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. 

రెండోసారి ప్రధాని అయిన మోడీపై సహజంగానే కాస్త వ్యతిరేకత పెరిగింది. కాబట్టి ఇలాంటి టైమ్ లో జమిలీకి వెళ్లాలని బీజేపీ అనుకోదు. పోనీ.. పట్టుబట్టి వెళ్దాం అనుకున్నప్పటికీ, ఆ మేరకు బిల్లు ప్రవేశపెడితే.. లోక్ సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో వీగిపోవడం ఖాయం.

ఓవైపు ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుంటే బాబు మాత్రం జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, సిద్ధంగా ఉండమంటూ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. దీంతో స్వయంగా టీడీపీ కార్యకర్తలే బాబును చూసి నవ్వుకుంటున్నారు. 

ఇలాంటి భ్రమలతోనే పార్టీని భ్రష్టుపట్టించారని, ఇదే బ్రెయిన్ వాడితే వచ్చే ఎన్నికల నాటికి డిపాజిట్లు కూడా ఉండవని చిరాకుపడుతున్నారు. అయితే కేడర్ ను కాపాడుకోవడం కోసమే బాబు ఇలా జమిలీ..జమిలీ అంటూ కలవరిస్తున్నారనేది వాస్తవం. 

విశాఖ మీద ఆ సామాజిక వర్గం పట్టు ఉంటుందా