నాపై ఇంత నెగెటివిటా?షాక్ అయ్యాః బిగ్‌బాస్ ఫేం

త‌నపై స‌మాజంలో జ‌రుగుతున్న నెగెటివిటీపై బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-5 కంటెస్టెంట్ సిరి లబోదిబోమంటున్నారు. ష‌ణ్ముఖ్‌, తాను హ‌గ్ చేసుకోవ‌డాన్ని స‌మాజం రిసీవ్ చేసుకోలేద‌ని విష‌యాన్ని తెలుసుకుని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లు…

త‌నపై స‌మాజంలో జ‌రుగుతున్న నెగెటివిటీపై బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-5 కంటెస్టెంట్ సిరి లబోదిబోమంటున్నారు. ష‌ణ్ముఖ్‌, తాను హ‌గ్ చేసుకోవ‌డాన్ని స‌మాజం రిసీవ్ చేసుకోలేద‌ని విష‌యాన్ని తెలుసుకుని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లు ఇలా జరుగుతుంద‌ని ఊహించ‌లేద‌ని సిరి వాపోయారు.

తాజా రియాల్టీ షోలో టాప్‌-5లో సిరి ఉన్న సంగ‌తి తెలిసిందే. విజేత‌గా స‌న్నీ నిలిచారు. కానీ ష‌ణ్ముఖ్ విజేత‌గా నిల‌వాల‌ని సిరి కోరుకున్నారు. హౌస్ నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు. కారులో వ‌స్తూ యూట్యూబ్‌ను ఓపెన్ చేయ‌గా, త‌న గురించి బాగా నెగెటివ్ ప్ర‌చారం కావ‌డాన్ని చూసి షాక్‌కు గురైన‌ట్టు చెప్పారు. త‌మ మ‌ధ్య స్నేహ‌బంధాన్ని జ‌నం నెగెటివ్‌గా తీసుకున్నార‌ని చెప్పుకొచ్చారు.

త‌మ గురించి ఈ విధంగా నెగెటివ్‌గా జ‌నంలోకి వెళ్లిపోయిందా? అనిపించింద‌న్నారు. ఈ విష‌యం త‌న‌కు బ‌య‌టికి వ‌చ్చినంత వ‌ర‌కూ తెలియ‌లేద‌న్నారు. ష‌ణ్ముఖ్ చాలా మంచి స్నేహితుడ‌న్నారు. త‌న‌ జీవితంలో ష‌ణ్ముఖ్ ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని సిరి మ‌రోసారి చెప్ప‌డం విశేషం. హౌస్‌లో త‌న‌ను ష‌ణ్ముఖ్ ఎంతో మోటివేట్ చేశాడ‌న్నారు. ప‌క్క‌వాళ్ల‌తో ఎలా గేమ్ ఆడాలో కూడా మొద‌ట్లో తెలిసేది కాద‌న్నారు. ఆ స‌మ‌యంలో ఎలా ఆడాలో అత‌ను చెబుతూ వుండ‌డం వ‌ల్ల ష‌ణ్ముఖ్‌తో బంధం బ‌ల‌ప‌డింద‌న్నారు.

ష‌ణ్ముఖ్‌ను హ‌గ్ చేసుకోడాన్ని బ‌య‌ట జ‌నం రిసీవ్ చేసుకోలేద‌నే విష‌యం అర్థ‌మైంద‌న్నారు. కానీ త‌మ‌ ఇద్ద‌రి మ‌ధ్య నిజ‌మైన స్నేహం ఉంద‌న్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత స్నేహంగా ఉన్నామో, బ‌య‌ట కూడా అట్లే ఉంటామ‌న్నారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి క్లారిటీ ఉంద‌న్నారు. ఇద్ద‌రికీ త‌మ జీవితాల‌పై స్ప‌ష్ట‌త ఉన్న‌ట్టు సిరి తెలిపారు. త‌మ కాబోయే జీవిత భాగ‌స్వాముల‌కు కూడా క్లారిటీ ఉన్న‌ట్టు తెలిపారు.