గత రెండు మూడు రోజులుగా ఓ గ్యాసిప్. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా లేదు. డైరక్ట్ గా రాజమౌళి సినిమానే అంటూ. కానీ ఒకటే అనుమానం మహేష్ బాబు అంత పిచ్చిపని చేస్తాడా? అన్నదే.
ఎందుకంటే ఒకసారి ఇద్దరి కాంబినేషన్ అంతా సెట్ అయినట్లే అయింది.చివరి నిమిషంలో ఆగిపోయింది. అప్పటి నుంచి మళ్లీ ఇద్దరి మధ్య ప్యాచప్ కోసం ఎన్నో ప్రయత్నాలు. ఆఖరికి అంతా సెట్ అయింది. మే నుంచి షూటింగ్ అని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఈ గ్యాసిప్ నిజంగా గ్యాసిప్ యేనా? నిజమా?
నిజానికి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా వదులుకోవడం అంటే మహేష్ ది బ్యాడ్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే వన్స్ రాజమౌళి సినిమా మీదకు వెళ్తే కనీసం లో కనీసం రెండేళ్లు పడుతుంది. ఆ తరువాత త్రివిక్రమ్ సంగతేమిటో? మహేష్ సంగతేమిటో? పైగా సర్కారువారి పాట మీద డవుట్ లు వున్నాయి. ఆ సినిమా షూటింగ్ ను మహేష్ ఆపారని, ఇంకా 45 రోజులు షూట్ వుందని, కొన్ని సీన్లు రీరైట్ చేస్తున్నారని. ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా వదిలేసి, రెండేళ్లు గ్యాప్ తీసుకోవడం సరికాదు.
సర్కారువారిపాట 2022 లో విడుదలయితే, 2023 కి త్రివిక్రమ్ సినిమా వుంటుంది. 2024 లో రాజమౌళి సినిమా రావడానికి అవకాశం వుంటుంది. పెద్దగా గ్యాప్ వుండదు. అలా కాకుండా నేరుగా రాజమౌళి సినిమా మీదకు వెళ్తే గ్యాప్ బాగా కనిపిస్తుంది.
ఇదిలా వుంటే నిజంగా క్యాన్సిల్ అయితే త్రివిక్రమ్ నెత్తిన పాలు పోసినట్లే. ఎందుకంటే బన్నీ రెడీగా వున్నారు. ఆరునెలల్లో సినిమా రెడీ చేసుకోవచ్చు.అదే మహేష్ సినిమా అంటే వచ్చే సంక్రాంతి ఆగాల్సిందే.
మరి ఏం జరుగుతుందో చూడాలి.