హీరో నాని ఎప్పుడూ మన పక్కింటి అబ్బాయిలా క్యాజువల్ గా కనిపిస్తాడు. అతడి లుక్, డ్రెస్సింగ్ ఎప్పుడూ అలానే ఉంటుంది. కానీ చాన్నాళ్లకు సూట్ లో కనిపించాడు ఈ హీరో. శ్యామ్ సింగరాయ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బ్లేజర్ వేసుకొని వచ్చాడు. చలికాలం కాబట్టి బ్లేజర్ వేసుకున్నాడని అంతా అనుకున్నారు, కానీ అది కారణం కాదంటున్నాడు నాని.
“ఈవెంట్ కు నేను వైట్ లేదా బ్లాక్ డ్రెస్ లో వస్తానని చాలామంది అన్నారు. కానీ బ్లేజర్ లో వచ్చాను. మా ఆవిడ ఓ 10 బ్లేజర్లు కొనింది. అవి ఎప్పుడు వేసుకోవాలో తెలీదు. నాకు అంత ధైర్యం కూడా లేదు. మరీ సూట్ వేసుకొని తిరగడానికి మనం ఏం పీకామని అనిపిస్తుంటుంది. అందుకే ఇప్పటివరకు వేసుకోలేదు. దుమ్ము పట్టి అలానే ఉండిపోయాయి. ఎప్పుడైతే శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ కాపీ చూశానో, అప్పుడు సూట్ వేసుకోవాలనిపించింది.”
శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూట్ వేసుకునే అర్హత తనకొచ్చినట్టు చెప్పుకొచ్చాడు నాని. సూట్ వేసుకోవాలనే ధైర్యాన్ని తనకు శ్యామ్ సింగరాయ్ ఇచ్చిందంటున్న నాని.. తనతో పాటు యూనిట్ అందరి కళ్లల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించడానికి కారణం ఈ సినిమాగా చెప్పుకొచ్చాడు.
ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది శ్యామ్ సింగరాయ్ సినిమా. రాహుల్ సంకృత్యాన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిషెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇదే.