ఎక్స్ క్లూజివ్-మళ్లీ నిర్మాణం లోకి ప‌వన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. శరత్ మరార్ నిర్మాతగా చేసిన సినిమాలు సమర్పకుడిగా వున్నారు.  Advertisement అయితే నిర్మాతగా వున్నా ఎప్పుడూ పెద్దగా లాభాలు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో కూడా ఆయన సినిమాలు నిర్మించారు. శరత్ మరార్ నిర్మాతగా చేసిన సినిమాలు సమర్పకుడిగా వున్నారు. 

అయితే నిర్మాతగా వున్నా ఎప్పుడూ పెద్దగా లాభాలు కళ్ల చూసింది లేదు.  కానీ ఆయనకు నిర్మాణం అంటే ఇష్టం. అందుకే మళ్లీ నిర్మాతగా 2022 లో పవన్ రంగ ప్రవేశం చేయబోతున్నారు.

ఈసారి కూడా ఆయన స్వంతంగా కాకుండా తన బ్యానర్ సమర్పణలోనే సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ఓ మెగా హీరోతోనే ఆయన సినిమా నిర్మిస్తారని బోగట్టా. అయితే అందులో పవన్ స్పెషల్ అప్పీయరెన్స్ వుంటుందా? లేదా అన్నది ఇంకా డిస్కషన్ లో వుంది.

ప్రస్తుతానికి అన్నీ డిస్కషన్ ల్లో వున్నాయి. కథ, దర్శకుడు, హీరో వరకు ఫైనల్ అయ్యాయని, అవన్నీ కొద్ది రోజుల్లో బయటకు వస్తాయని తెలుస్తోంది. అప్పుడే పవన్ కూడా ఆ సినిమాలో వుంటారా? వుండరా? అన్నది క్లారిటీ వస్తుంది.