బిగ్ బాస్ ఫైనల్ కు పవన్ నో

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలె కు చీఫ్ గెస్ట్ గా వెళ్లడానికి మన హీరోలు చాలా మంది నో అనేసారని బోగట్టా. బిగ్ బాస్ ఆర్గనైజర్లు పలువురు హీరోలను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.…

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలె కు చీఫ్ గెస్ట్ గా వెళ్లడానికి మన హీరోలు చాలా మంది నో అనేసారని బోగట్టా. బిగ్ బాస్ ఆర్గనైజర్లు పలువురు హీరోలను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. కానీ రకరకాల కారణాల వల్ల, బిజీగా వుండడం వల్ల ఎవ్వరూ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని ఆయన అపాయింట్ మెంట్ కోసం కూడా ట్రయ్ చేసారు. కానీ ఆయన కూడా పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదు అని తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 కు పెద్దగా ఆదరణ రాలేదు. 

జనాలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. గత సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ కానీ, ఆదరణ కానీ ఈ సీజన్ కు రాలేదు. హోస్ట్ గా నాగ్ కూడా రొటీన్ అయిపోయారు. 

అందువల్లే టాలీవుడ్ టాప్ పీపుల్ ఎవ్వరూ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. నాని అండ్ టీమ్ కు సినిమా విడుదల వుంది. రెండు విదాలా పనికి వస్తుందని ఓకె చేసారని బోగట్టా.