నిన్నటికి నిన్న విడుదలైన భారీ చిత్రం పుష్పకు చిన్నపాటి మార్పులుచేర్పులు చేస్తున్నారు. సినిమా సెకండాఫ్ మీద మిక్స్ డ్ టాక్ వుండడంతో, క్రిటిక్స్ వైపు నుంచి వచ్చిన కొన్ని సజెషన్స్ దృష్టిలో వుంచుకుని సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది,.
ముఖ్యంగా వాన్ హీరో బన్నీ హీరోయిన్ రష్మిక భుజం మీద నుంచి దిగువగా చేయివేసిన సీన్ ను కట్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ సినిమాలో ఇలాంటి సీన్ నా అని కామెంట్లు గట్టిగా వచ్చాయి. అందుకే అది ట్రిమ్ చేస్తున్నారని తెలుస్తోంది.
అలాగే క్లయిమాక్స్ కాస్త లెంగ్తీ అయిందని టాక్ వచ్చింది. అక్కడ కొద్దిగా ట్రిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కీలకంగా ఆర్ఆర్ మీద కాస్త అసంతృప్తి వెల్లడయింది. దాన్ని అవకాశం వున్నచోట్ల చేంజ్ చేస్తున్నారని బోగట్టా.
ఇలా చేసిన కొత్త వెర్షన్ ఆదివారం నుంచే థియేటర్లలోకి వచ్చేలా చూస్తున్నారని తెలస్తోంది. పుష్పకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరీ భయంకరమైన నెగిటివ్ టాక్ రాలేదు. అందుకే ముందే జాగ్రత్త పడితే సినిమా మండే నుంచి జారి పడకుండా వుంటుందని చూస్తున్నారు.