పవన్-శ్రీలీల-అటు ఇటవుతోందా?

దర్శకుడు హరీష్ శంకర్ ను బ్యాడ్ లక్ వెంటాడుతోందేమో? ఎప్పటి నుంచో వెయిటింగ్ లో వున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కోసం. ఇప్పుడిప్పుడే వ్యవహారాలు చక్కబడుతున్నాయి. షెడ్యూలు దిశగా వెళ్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. …

దర్శకుడు హరీష్ శంకర్ ను బ్యాడ్ లక్ వెంటాడుతోందేమో? ఎప్పటి నుంచో వెయిటింగ్ లో వున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కోసం. ఇప్పుడిప్పుడే వ్యవహారాలు చక్కబడుతున్నాయి. షెడ్యూలు దిశగా వెళ్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

హీరోయిన్ గా శ్రీలీల ను తీసుకుంటున్నారు అని కూడా బయటకు వచ్చింది. అసలే మాస్ ఎంటర్ టైనర్ తీస్తారు హరీష్ శంకర్. అలాంటి సినిమాలో పవన్ సరసన శ్రీలీల అంటే ఓ రేంజ్ లో వుంటుంది వ్యవహారం. ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారు ఈ వార్త విని.

కానీ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఓ కొత్త ట్విస్ట్ వస్తోందని తెలుస్తోంది. అదేమిటంటే, పవన్-సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య ఓ సినిమా నిర్మించబోతున్నారు. దానికి కూడా ఓ హీరోయిన్ కావాలి. ఇప్పుడు ఆ యూనిట్ దృష్టి కూడా శ్రీలీల మీదే పడింది. దాంతో వాళ్లు ఆ సినిమా కోసం శ్రీలీల ను లాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి అదే జరిగితే హరీష్ శంకర్ సినిమాకు మరో హీరోయిన్ ను వెదుక్కోవాల్సి వుంటుంది. పవన్ సరసన శ్రీలీల అన్నది ఫిక్స్. అయితే అది సుజిత్ డైరక్షన్ లో సినిమా, హరీష్ శంకర్ మూవీకా అన్నదే తేలాల్సి వుంది.