ఎక్స్ క్లూజివ్-విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల

హీరోయిన్ శ్రీలీల దూకుడు మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తోంది. అది కూడా క్రేజీ ప్రాజెక్టులు. పెళ్లి సందడి, ధమాకా తరువాత వరుసగా ఒకే సంస్థలో మూడు సినిమాలు సైన్ చేసింది. …

హీరోయిన్ శ్రీలీల దూకుడు మామూలుగా లేదు. సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తోంది. అది కూడా క్రేజీ ప్రాజెక్టులు. పెళ్లి సందడి, ధమాకా తరువాత వరుసగా ఒకే సంస్థలో మూడు సినిమాలు సైన్ చేసింది. 

సితార సంస్థలో వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, మహేష్ బాబుల సరసన ఫిక్స్ అయిపోయింది. ఈ లోగా వేరే బ్యానర్ లో పవన్ కళ్యాణ్ పక్కన చాన్స్ కొట్టేసింది.

ఇప్పుడు సితార సంస్థలోనే మరో క్రేజీ ప్రాజెక్టును ఓకె చేసింది. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. కచ్చితంగా ఇది మూడింతల క్రేజీగా వుంటుంది అనడంలో సందేహం లేదు. నిజానికి ఇప్పుడు శ్రీలీల ప్రాజెక్టుల్లో వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి ప్రాజెక్టులు చిన్నవిగా కనిపిస్తాయి.

సితారలో నాలుగు సినిమాలు, పవన్ సరసన మరో సినిమా మొత్తం అయిదు సినిమాల్లో శ్రీలీల హీరోయిన్ గా ఫుల్ స్వింగ్ లో వుందన్న మాట. ఇక ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, చరణ్ లాంటి వాళ్ల ప్రాజెక్టులు కూడా చేతిలోకి వస్తే ఈ జనరేషన్ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించేసుకుంటుంది.