రజనీ సోదరిగా జీవిత

సీనియర్ హీరోయిన్ జీవిత తెర మీద కనిపించి చాలా కాలం అయింది. ఇటు ఇంటి వ్యవహారాల్లో, రాజశేఖర్ సినిమాల వ్యవహారాలతో, రాజకీయాలు, ఇంకా ఇంకా బిజీగా గడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ మాంచి సినిమాలో,…

సీనియర్ హీరోయిన్ జీవిత తెర మీద కనిపించి చాలా కాలం అయింది. ఇటు ఇంటి వ్యవహారాల్లో, రాజశేఖర్ సినిమాల వ్యవహారాలతో, రాజకీయాలు, ఇంకా ఇంకా బిజీగా గడిపేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓ మాంచి సినిమాలో, మాంచి కాంబినేషన్ లో, మాంచి పాత్రలో కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ సోదరిగా ఓ సినిమాకు సైన్ చేసారు జీవిత అని తెలుస్తోంది.

రజనీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లాల్ సలామ్ లో జీవిత నటిస్తున్నారు. ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఇది అని తెలుస్తోంది.

రజనీ సినిమా కావడం, అందులోనూ రజనీ సిస్టర్ క్యారెక్టర్ కావడం, ప్రామినెంట్ పాత్ర కావడంతో జీవిత కు మంచి బ్రేక్ అనే చెప్పుకోవాలి.

ఇది క్లిక్ అయితే మళ్లీ చకచకా సినిమాల్లో జీవిత రాజశేఖర్ కనిపించే అవకాశం వుంది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత జీవిత తెరమీద కనిపించినట్లు అవుతుంది.