రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టామాటాలతో దాడి!

వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక్కసారిగా రేవంత్…

వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వైపు దూసుకొచ్చి కాంగ్రెస్ సభవైపు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు విసిరారు. దీంతో సభాస్థలి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకు రావాడానికి టీపీసీసీ అధ్య‌క్షుడు హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో గ‌త కొన్ని రోజులుగా పాద‌యాత్ర చేస్తున్నారు. ఆ పాద‌యాత్ర భాగంగా రేవంత్ రెడ్డి భూపాల‌ప‌ల్లిలో మాట్లాడుతుండ‌గా రేవంత్ గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేస్తు రాళ్ల చేసిన‌ట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ దాడుల‌పై పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తు.. నా పై కోడిగుడ్లు వేయించ‌డం కాదు.. ద‌మ్ముంటే ఇక్క‌డికి అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి స‌వాల్ విసిరారు. నేను త‌లుచుకుంటే నీ ఇల్లు కూడా ఉండ‌దు అంటూ ఎమ్మెల్యే గండ్ర‌కు వార్నింగ్ ఇచ్చారు. కాగా భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యే అయి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. బ‌హుశా దాడి వెనుక గ‌త కొన్ని రోజులుగా పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ చేస్తున్న వ్యాఖ్య‌ల ఫ‌లిత‌మే ఈ దాడులు అని భావిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.