పాదయాత్ర పొడవునా కనిపించిన వాటితో సెల్ఫీలు తీసుకుంటూ, అన్నీ మా నాయనే చేసాడు అంటూ తెగ మురిసిపోతున్నాడు సోషల్ మీడియాలో నారా లోకేష్ నాయుడు. అదే మాదిరిగా చంద్రగిరి మండలంలో ఓ టాప్ ప్రయివేటు విద్యాసంస్థ ఏర్పాటుకు తామే కారణమని, ఎనిమిది ఎకరాల భూమి ఇచ్చామని చెప్పుకొచ్చాడు.
కానీ లోకేష్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాబు భూములు ధారా దత్తం చేసినవన్నీ ఇలాంటి బడా సంస్థలే. వాటి వల్ల సామాన్యులకు పైసా ఉపయోగం లేదు. లక్షల్లో ఫీజులు కట్టే ధనవంతులకు తప్ప.
లోకేష్ ఈ విషయం ఇలా ట్వీట్ వేయగానే సోషల్ మీడియా జనాలు అలా తగులుకున్నారు. ఎల్కేజీకి లక్షన్నర కట్టాల్సిన విద్యాసంస్థతో సామాన్యులకు ఏమిటి ఉపయోగం అంటూ నిలదీసారు. అంతే కాదు, సదరు విద్యాసంస్థ ఫీజులు, యూనిఫారమ్ లు, ఇతరత్రా ఖర్చుల వైనాలు అన్నీ అక్కడ పోస్ట్ చేసి నిలదీసారు.
అంతేకాదు, మరి ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి ప్రయివేటు స్కూళ్లను ఎలా ఎంకరేజ్ చేసారు అంటూ కామెంట్లు చేసారు. మొత్తం మీద ఆ విధంగా లోకేష్ తన పార్టీకి ఏదో ప్లస్ చేద్దాం అనుకుంటే రివర్స్ అయింది. బాబుగారి బడాబాబులకు భూముల బండారం మరోసారి బయటపడింది.