ఈ మధ్య సినిమా బిజినెస్ మళ్లీ ఊపందుకుంది. దాంతో హీరోల రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నాయి. పెద్ద హీరోలు పెద్దగా పెంచుతుంటే, చిన్న హీరోలు కూడా తమ కెపాసిటీ మేరకు పెంచుతున్నారు.
ఇప్పటికే నాగశౌర్య రెమ్యూనిరేషన్ నాలుగు కోట్లు దాటేస్తే, మరో హీరో విష్వక్ సేన్ కూడా ఇప్పుడు నాలుగున్నర కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విష్వక్ ప్రస్తుతం ఢమ్కీ సినిమా విడుదలకు రెడీ చేసాడు. అది ఓన్ మూవీ. దీని తరువాత మే నుంచి సితార సంస్థలో సినిమా వుంది. ఆ తరువాత ఇంకా ఏ సినిమా ఓకె చేయలేదు. కానీ ఎవరు అడిగినా నాలుగున్నర నుంచి అయిదు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
విష్వక్ కు నైజాంలో కాస్త మార్కెట్ వుంది. మూడు కోట్ల వరకు కాస్త గ్యారంటీ వుంది. విష్వక్ కు నాలుగున్నర కోట్లు ఇస్తే ప్రొడక్షన్ కు, అన్నింటికీ కలిపి మరో పది కోట్లు పైగానే అవుతుంది. అంటే నాన్ థియేటర్ ప్లస్ థియేటర్ మీద పది హేను కోట్లకు పైగా రాబట్టాలి.
అందుకే నాలుగున్నర అంటే నిర్మాతలు కాస్త ముందు వెనుక ఆడుతున్నారు. రెండున్నర నుంచి మూడు అంటే ఓకె అనే ఆలోచనలు చేస్తున్నారు.