అయ్యన్నకు భారీ షాక్… ఆ కేసు దర్యాప్తు చేయాల్సిందే

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి భారీ షాక్ తగిలింది. ఫోర్జరీ కేసు వ్యవహారంలో అప్పట్లో అయ్యన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాని మీద…

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి భారీ షాక్ తగిలింది. ఫోర్జరీ కేసు వ్యవహారంలో అప్పట్లో అయ్యన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాని మీద హై కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న అయ్యన్న తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. పైగా తనకు హోం శాఖ ఇస్తే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలో నేర్పిస్తాను అని చెబుతూ వస్తున్నారు.

అయ్యన్న ఫోర్జరీ కేసు మీద పట్టు వదలని విక్రమారుకు మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ అయ్యన్నకు భారీ షాక్ తగిలింది.. ఫోర్జరీ సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం విచారణ కొనసాగాలని ఆదేశించింది. దీంతో అయ్యన్న కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ కేసు విషయం చూస్తే విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు తన ఇంటిని నిర్మించే సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేశారని ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాని మీద ఆయనను అరెస్ట్ కూడా చేశారు. 

అయ్యన్న మాత్రం తన తప్పు లేదని అంటూ ఏపీ హైకోర్టును అయ్యన్న ఆశ్రయించారు. దీంతో కేసు విచారణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీం కోర్టు ఈ కేసుని పూర్తిగా విచారించిన మీదట ఏపీ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అసంతృప్తిని వ్యక్తం చేసిందని సమాచారం. పైగా అయ్యన్నను ఈ కేసు విషయంలో విచారించవచ్చు అని పేర్కొనడంతో అయ్యన్న ఫోర్జరీ కేసు మీద మళ్ళీ కదలిక మొదలైంది అంటున్నారు.