ఎంతకాలం జగన్ని చూసి ఏడుస్తారు… ?

జగన్ అన్న మూడక్షరాలే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి పంచాక్షరిగా మారిపోయాయా. ఆయన 2009 వరకూ ఏ రకమైన రాజకీయం చేశారో కానీ వన్స్ జగన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చాక జగన్నామస్మరణే చేస్తున్నారా అంటే…

జగన్ అన్న మూడక్షరాలే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి పంచాక్షరిగా మారిపోయాయా. ఆయన 2009 వరకూ ఏ రకమైన రాజకీయం చేశారో కానీ వన్స్ జగన్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చాక జగన్నామస్మరణే చేస్తున్నారా అంటే అది నిజమేనని ఈ రోజుకీ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు.

లేటెస్ట్ గా వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి అయితే చంద్రబాబు మీద పంచు డైలాగులే పేల్చారు. తన సొంత నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చంద్రబాబు మీద ఘాటుగానే కామెంట్స్ చేశారు. ఎంతకాలం ఇలా జగన్ మీద పడి ఏడుస్తారు బాబు గారూ అంటూ గట్టిగానే నిలదీశారు. 

గత రెండున్నరేళ్ళుగా జనాలు మీకు వరసబెట్టి ప్రతీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతున్నా పట్టించుకోరా. జగన్ మీద పడి ఏడిస్తే ఏం లాభమని కూడా ఒక్కసారి కూడా ఆలోచించరా అంటూ పుష్ప శ్రీవాణి గట్టిగానే మాట్లాడేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీనియర్ నాయకుడు అని ప్రజలు మీకు పట్టం కడితే అమరావతి రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారని కూడా ఉప ముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేశారు. 

అమరావతి రాజధాని పేరిట జనాలను మభ్యపెట్టి అక్కడి భూములను తన సొంత మనుషులతో కారు చౌకగా కొనిపించేసి  మరీ సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి తహతహలాడారని మండిపడ్డారు.

పదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీలో రాజధానిగా హైదరాబాద్ మీద హక్కులు ఉన్నా కూడా వాటిని కాదని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఏపీకి వలస వచ్చారంటూ బాబు మీద బాగానే మాటలు పేల్చారు. మీ అమరావతి రాజధాని కధలను ఇకనైనా ఆపాలని ఆమె కోరారు దేవుడు, ప్రజల దయ ముఖ్యమంత్రి జగన్ వైపు ఉన్నాయని, కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆయన మేలు చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

మొత్తానికి చంద్రబాబు చెప్పేవన్నీ అమరావతి కధలేనని, జగన్ని చూసి ఏడ్చే కన్నీటి కధలేనని పుష్ప శ్రీవాణి ఒక్క లెక్కన తేల్చేశారు అనుకోవాలి.