ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు మద్దతుగా చిరంజీవి ఏకంగా లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన మూడు రాజధానులను తను పూర్తిగా స్వాగతిస్తున్నానని, ఇది మంచి పరిణామం అంటూ చిరంజీవి అధికారికంగా లెటర్ విడుదల చేశారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు, ఆ లేఖ నకిలీదంటూ ప్రచారం చేశారు. పైగా చిరంజీవి లెటర్ హెడ్ ను ఫోర్జరీ చేస్తూ, మరో నకిలీ లేఖను సృష్టించారు. దీనిపై మరోసారి స్పందించారు చిరంజీవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానుల ఏర్పాటును సమర్థిస్తూ లేదా వ్యతిరేకిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదంటూ.. తన పేరిట వచ్చిన లేఖ నకిలీదని స్పష్టంచేశారు చిరంజీవి. రాష్ట్రానికి 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు ఈ సందర్భంగా మరోసారి స్పష్టంచేశారు. మూడు రాజధానులకు మద్దతుగా శనివారం తను విడుదల చేసిన లేఖ ఫేక్ కాదని, అదే నిజమని స్పష్టంచేశారు.
“నేను ఇచ్చానంటూ ఒక విజ్ఞప్తి 22వ తేదీన, ఒక వైట్ పేపర్ పై నా సంతకంతో సర్కులేషన్ లోకి వచ్చింది. 3 రాజధానుల మీద నేను 21వ తేదీన ఇచ్చిన అభిప్రాయం కాదు అని ఖండిస్తూ ఇంకోటి వచ్చింది. అలా సర్కులేషన్ లోకి వచ్చింది అవాస్తవం. 3 రాజధానులకు మద్దతు ఇస్తూ నేను ఇచ్చిన ప్రకటన వాస్తవం.”
ఇలా మరోసారి 3 రాజధానుల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. 3 రాజధానుల వ్యవహారాన్ని కొంతమంది చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు.. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫేక్ లెటర్ పుట్టుకొచ్చింది. ఊహించని విధంగా చిరంజీవి మరోసారి స్పందించారు. ఇకనైనా ఈ విషయంపై జనసైనికులు, చిరు అభిమానులు ఆయనకు మద్దతిస్తే మంచిది