మెగాస్టార్…రెండు షాక్ లు

ఏమైనా మెగాస్టార్ మెగాస్టార్ నే. ఆయన ఏం చేసినా సంచలనమే. స్టేజ్ మీద గెంతులు, చిందులు వేయకపోవచ్చు, వున్నట్లుండి హై పిచ్ లో అరవకపోవచ్చు, రకరకాల వేషాలు ఆఫ్ ది స్క్రీన్ వేయకపోచ్చు. కానీ…

ఏమైనా మెగాస్టార్ మెగాస్టార్ నే. ఆయన ఏం చేసినా సంచలనమే. స్టేజ్ మీద గెంతులు, చిందులు వేయకపోవచ్చు, వున్నట్లుండి హై పిచ్ లో అరవకపోవచ్చు, రకరకాల వేషాలు ఆఫ్ ది స్క్రీన్ వేయకపోచ్చు. కానీ ఆయన సరైన టైమ్ లో సరైన మాత్ర వేసి, భలేగా సంచలనానికి దారి తీస్తారు.

మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న రెండు నిర్ణయాలు ఈవారం అలాంటి సంచలనానికి కారణం అయ్యాయి. ఈ రెండూ కూడా మెగా ఫ్యాన్స్ లో అంతర్గత చర్చలకు దారితీయడం విశేషం. అదెలా అంటే ముందుగా వచ్చిన డెసిషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కావాలన్నది.

ఇది మెగాఫ్యాన్స్ కు ఓ విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మహేష్-బన్నీసినిమాలు రెండూ సంక్రాంతికి పోటా పోటీగా విడుదలవుతున్నాయి. ఇరు సినిమాల కంటెంట్ ను ఫ్యాన్స్ ప్రమోట్ చేయడం, ట్రోలింగ్ చేయడం విపరీతంగా జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ అన్నది మెగా ఫ్యాన్స్ కు డైజెస్ట్ కావడం లేదు. అది పక్కా ఫ్యాక్ట్.

అయితే ఇక్కడ బన్నీ తప్పు కూడా వుంది. సైరా సినిమా సమయంలో బన్నీ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదన్న కంప్లయింట్ వుంది. అది వదిలేసినా, బన్నీ సినిమా పంక్షన్ కు ఏ చీఫ్ గెస్ఠ్ వద్దు అని ముందుగా అనుకున్నారు. అందుకే ఎవ్వరూ మెగాస్టార్ ను అప్రోచ్ కాలేదు. మహేష్ టీమ్ దీన్ని చాన్స్ గా తీసుకుంది. నేరుగా మహేష్ బాబే మెగాస్టార్ కు ఫోన్ చేసి, రిక్వెస్ట్ చేయడంతో ఆయన కాదనకుండా ఓకె అనేసారు.

ఇక రెండో విషయం.

మూడు రాజధానులు వుండాలన్నవైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతు పలకడం. ఆంధ్రకు మూడు రాజధానులు వుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించగానే జనసేన అధిపతి, మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో టపా టపా ట్వీట్ లు వేసారు. 17, 18 తేదీల్లో భయంకరంగా ట్వీట్ ల మీద ట్వీట్ లు వేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మౌనం వహించారు. ఓ కమిటీ వేసానని చెప్పి చేతులు దులుపుకున్నారు. కేవలం రెండు జిల్లాల కోసం చూస్తే 11 జిల్లాల జనాల మనోగతానికి వ్యతిరేకం అవుతానని పవన్ కు ఆలస్యంగా అర్థం అయివుంటుంది.

ఇలాంటి నేపథ్యంలో వున్నట్లుండి చిరంజీవి రంగంలోకి దిగి వైకాపా అధినేత జగన్ నిర్ణయానికి పూర్తి మద్దతుగా మాట్లాడడం నిజంగా మెగా ఫ్యాన్స్ కు షాక్ నే. వారంతా జనసేన అభిమానులు కాకపోవచ్చు కానీ పవన్ అభిమానులు అన్నది చాలా వరకు వాస్తవం. తమ్ముడి అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు. కానీ ఇలా బాహాటంగా ప్రకటించడంతో ఇప్పుడ మెగాభిమానులు డైలామాలో పడిపోయారు.

అన్న మెగాస్టార్ కరెక్ట్ నా? తమ్ముడు పవర్ స్టార్ కరెక్ట్ నా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అంతే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ ను ఈ షాక్ నుంచి కాపాడడానికి తెలుగుదేశం జనాలు రంగంలోకి దిగారు. మెగాస్టార్ ను విమర్శిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలవడాన్ని మళ్లీ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి తోడుగా వుంటుందనుకున్న జనసేన జనాల్లో వున్న మెగా ఫ్యాన్స్ ఈ పరిస్థితికి హర్డ్ అవుతున్నారు. దాంతో అదో హడావుడి.

ఇలా మొత్తం మీద మెగాస్టార్ రెండు నిర్ణయాలు మెగా ఫ్యాన్స్ లో అలజడి రేపాయి. కొసమెరుపు ఏమిటంటే, మహేష్ సినిమాకు మెగాస్టార్ అతిథిగా వెళ్తున్నారు కదా? ఇకనైనా సరిలేరు నీకెవ్వరు సినిమా వ్యవహారాల మీద మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆగిపోతుందా?  అని ఫ్యాన్స్ ను అడిగితే, 'అది అదే..ఇది ఇదే' అని చెప్పడం. 

ఫ్యాన్స్ కు కూడా రాజకీయాలు వంటబట్టేసాయి.