పెళ్లి కబురు మోసుకొచ్చిన చందమామ

నిన్న లవ్ సింబల్ పెట్టినప్పుడే అంతా ఫిక్స్ అయిపోయారు. అదే నిజమైంది. కాజల్ తన పెళ్లి కబురు మోసుకొచ్చింది. గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Advertisement “అక్టోబర్ 30న ముంబయిలో గౌతమ్…

నిన్న లవ్ సింబల్ పెట్టినప్పుడే అంతా ఫిక్స్ అయిపోయారు. అదే నిజమైంది. కాజల్ తన పెళ్లి కబురు మోసుకొచ్చింది. గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

“అక్టోబర్ 30న ముంబయిలో గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నాను. ఇదొక చిన్న, ప్రైవేటు వేడుక. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు. కరోనా మహమ్మారి మా ఆనందాన్ని కొంచెం తగ్గించిన మాట నిజమే కానీ నేను-గౌతమ్ కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నామనే విషయం థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది.”

ఇలా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది కాజల్. ముంబయికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త గౌతమ్. అతడికి ఓ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీతో పాటు మరో 2 వ్యాపారాలున్నాయి. ఇతడితోనే కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోంది కాజల్. ఇప్పుడు పెళ్లి మేటర్ ను అఫీషియల్ గా బయటపెట్టింది.

పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్ ఇక సినిమాలు చేయదేమో అనే అనుమానం అక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని కాజల్ స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఆచార్య, ఇండియన్-2, మోసగాళ్లు సినిమాలున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి