నమ్మితేనే మోసపోతారని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో యువతులు మోసపోతుంటారు. ప్రేమ పేరుతో చెప్పే తియ్యటి మాటలను నమ్మి , సర్వస్వం అప్పగించేసి … ఆ తర్వాత తీరిగ్గా మోసపోయామని అమ్మాయిలు గగ్గోలు పెట్టడం తరచూ చూస్తుంటాం.
తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇలాంటి విషయమై ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. అయితే కోర్టు జోక్యంతో సదరు మోసగాడైన ప్రేమికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హీరోయిన్గా సనంశెట్టి తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటించారు. నటుడు దర్శిన్ ప్రేమలో సనంశెట్టి పడ్డారు. నటుడు దర్శిన్ తమిళ బిగ్బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. సనంశెట్టి, దర్శిన్ కొంతకాలంగా ప్రేమించుకుం టున్నారు. పెళ్లి తర్వాతి స్టెప్ పెళ్లే కదా! తీరా పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి దర్శిన్ అడ్డం తిరిగాడు. కాదు, కూడదని మొండికేశాడు.
దీంతో మనసిచ్చిన వాడు మనువాడుతాడనుకుంటే మోసానికి పాల్పడడంతో హీరోయిన్ సనంశెట్టి హర్ట్ అయింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఆడియారు మహిళా పోలీస్స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఒక పట్టాన పోలీసులు న్యాయం చేసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? ఇక్కడ కూడా అలాంటి సీన్ రిపీట్ అయింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్లే ఏడాది పాటు ఇద్దరం చెట్టపట్టాలేసుకుని తిరిగామని, ఇప్పుడు కాదంటే తన గతేం కావాలని మహిళా పోలీస్స్టేషన్లో ఎంత మొరపెట్టుకున్నా , ప్రయోజనం లేకపోయింది. దర్శిన్పై విచారణ వరకే పోలీసులు పరిమితమై … ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమెకు కోపం వచ్చింది.
న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారామె. చివరికి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్ పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దర్శిన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులు, కోర్టులు సరే …ప్రేమించిన వాడు పెళ్లి చేసుకొనే అవకాశం లేనట్టేనా?