తండ్రి మొదలు పెట్టాడు.. కొడుకు నెంబర్-1 చేశాడు

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికలు. అసలు ఆరోగ్య శ్రీ పేరు చెబితేనే స్వర్గీయ వైఎస్ఆర్ అందరి మనసుల్లో మెదులుతారు. ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధిపొందిన ప్రతి…

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రికలు. అసలు ఆరోగ్య శ్రీ పేరు చెబితేనే స్వర్గీయ వైఎస్ఆర్ అందరి మనసుల్లో మెదులుతారు. ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధిపొందిన ప్రతి పేద కుటుంబం వైఎస్ ను దేవుడిలా కొలిచింది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఆయన తనయుడు జగన్ హయాంలో దేశానికే గర్వకారణంగా మారింది.

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, పథకం అమలు తీరుని పక్కాగా పర్యవేక్షిస్తూ.. దేశంలోనే అత్యథిక శాతం మంది ప్రజలకు ఆరోగ్యబీమా వర్తింపజేస్తున్న రాష్ట్రంగా ఏపీ తొలి స్థానంలో నిలిచింది. జాతీయ శాంపిల్ సర్వేలో ఆరోగ్యశ్రీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో వెల్లడైంది. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 76.1 శాతం మంది ఆరోగ్యశ్రీ ద్వారా బీమా సౌకర్యం పొందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని 55.9 శాతం మంది ప్రజలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.

గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసేవారు. అయితే జగన్ వచ్చిన తర్వాత తెల్లకార్డుతో సంబంధం లేకుండా వార్షికాదాయం 5లక్షల లోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశారు. జబ్బుల సంఖ్యను 1059 నుంచి 2వేలకు పెంచారు. దీంతో ఇటీవల కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 95శాతం కుటుంబాలకు పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయంటే.. అది అతిశయోక్తి కాదు. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆటోమేటిక్ గా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వెసులుబాటు కల్పించడం మరో ముఖ్యమైన అంశం. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం ఓవైపు, లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండటంతో.. ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యబీమా అమలు చేసే రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉంది.

తెలంగాణ కూడా ఏపీ వెంటే ఉన్నా కూడా అక్కడ లబ్ధిదారుల సంఖ్య తక్కువగానే ఉంది. తమిళనాడు, కర్నాకట, కేరళ.. అన్నీ తెలుగు రాష్ట్రాల తర్వాతే.

అసలు దేశంలో ఎంతమందికి ఆరోగ్య బీమా ఉంది..

భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాల సగటు ఖర్చు ఎక్కువగా ఆస్పత్రి వ్యవహారాలకే ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల తీరు సరిగా ఉండక, కార్పొరేట్ ఆస్పత్రుల బిల్లులు భరించలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇలాంటి కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది కేంద్రం. ప్రచార లోపం, ప్రజల అవగాహన లోపంతో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య కనిష్టంగా ఉంది.

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 12.9 శాతం మంది మాత్రమే ఆయుష్మాన్ భారత్ కింద కవరేజ్ పొందుతున్నారు. ఇక ఎలాంటి బీమా లేనివారి సగటు చూస్తే.. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య బీమా లేదు, పట్టణ ప్రాంతాల్లో 80.9శాతం మందికి బీమా లేదు.

ప్రభుత్వం తరపున ఆరోగ్య బీమా కార్యక్రమంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వే తర్వాత ఏపీలో జరిగిన మార్పులు పరిగణలోకి తీసుకుంటే.. ఇక ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో కనిపించదు అనేది మాత్రం వాస్తవం. 

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి