అయ్యో హరిహర.. ఎంత కష్టమొచ్చింది

అందరి నుంచి అడ్వాన్సులు తీసుకున్నాడు. అందరి సినిమాలకు కొబ్బరికాయలు కొట్టేశాడు. కానీ కొబ్బరికాయలు కొట్టినంత ఈజీగా కాల్షీట్లు కేటాయించడం కుదరదు కదా. ఇప్పుడు అదే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. Advertisement ప్రస్తుతం…

అందరి నుంచి అడ్వాన్సులు తీసుకున్నాడు. అందరి సినిమాలకు కొబ్బరికాయలు కొట్టేశాడు. కానీ కొబ్బరికాయలు కొట్టినంత ఈజీగా కాల్షీట్లు కేటాయించడం కుదరదు కదా. ఇప్పుడు అదే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్.

ప్రస్తుతం 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చిన పవన్, మరో సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే విషయంలో కిందామీద పడుతున్నాడు. అవే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయాల్సిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (తాజాగా పేరు మార్చారు). ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాకు మార్చి నుంచి కాల్షీట్లు ఇవ్వాలనుకుంటున్నాడు పవన్. ఇక సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా స్టార్ట్ చేసిన పవన్, ఆ మూవీకి ఏప్రిల్ నుంచి కాల్షీట్లు ఇవ్వాలనుకుంటున్నాడట.

ఆల్రెడీ హరిహర వీరమల్లు, వినోదాయశితం రీమేక్ లు సెట్స్ పై ఉన్నాయి. వినోదాయ శితం కోసం హరిహర మూవీకి బ్రేక్ ఇచ్చాడు.

వచ్చేనెల నుంచి హరీశ్ సినిమా స్టార్ట్ అయితే.. పై రెండు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. ఇక సుజిత్ సినిమా కూడా సెట్స్ పైకి వస్తే, ఎన్ని సినిమాలకు బ్రేకులు పడతాయో పవన్ కే తెలియాలి.

ఉన్నంతలో వినోదాయ శితం సినిమా పవన్ ను పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే, ఈ సినిమాకు పవన్ ఇచ్చింది కేవలం 20 కాల్షీట్లు మాత్రమే. మిగతా సినిమాలన్నింటినీ పవన్ తోడ్పాడు చాలా అవసరం. పవన్ ఓ సినిమా సెట్స్ పైకి వెళ్తే, మిగతా సినిమా యూనిట్లు అలా ఎదురుచూస్తూ కూర్చోవాల్సిందే.