కోర్టు తీర్పు టాలీవుడ్ కు ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా క్రిస్మస్, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు ఇంతా అంతా ఆనందం కాదు.
రేట్లు లేకపోవడం వల్ల పుష్ప 15 కోట్ల మేరకు ఆర్ఆర్ఆర్ 28 కోట్ల మేరకు రేట్లలో కోత పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులు ముందు విడుదలైన అఖండ సినిమా ఆరేడు కోట్లు కోత పెట్టుకుంది.
సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు తీర్పు రావడంతో పుష్ప మేకర్లకు ఆనందమే ఆనందం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 15 కోట్ల మేరకు తేడా. అసలే రెండు భాగాలుగా తీయడం వల్ల, కాస్త బడ్జెట్ పెరగడం వల్ల కాస్త డెఫిసిట్ లో విడుదలవుతోందని వార్తలు వున్నాయి,.
ఇప్పుడు ఆ డెఫిసిట్ కాస్తా కవర్ అయిపోతుంది. ఆంధ్ర 60 కోట్ల మేరకు అమ్మాలనుకుని, 48 కోట్లు చేసారు. ఇక ఇప్పుడు 60 కోట్లు డిమాండ్ చేయవచ్చు. అలాగే సీడెడ్ కూడా. ఇదే బాటలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ నడుస్తాయి. పాపం మిరియాల రవీందర్ రెడ్డి దే బ్యాడ్ లక్.