సినిమా టికెట్ రేట్లు జీవో ను కోర్టు కొట్టివేసింది. అంతే కాదు, టికెట్ రేట్లు పెంపు విషయంలో గతంలో మాదిరిగా వ్యవహరించేందుకు వీలుగా థియేటర్ల యజమానులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. మొదటి నుంచీ ఈ కొత్త జీవో మీద కోర్టుకు వెళ్తే దానికి వ్యాలిడిటీ వుండదనే వాదనలు వినిపిస్తూ వచ్చాయి.
ఎందుకంటే థియేటర్ అన్నది ప్రయివేటు వ్యవహారం. దాన్ని ప్రభుత్వం నియంత్రించడం ఏమిటి ? నర్సింగ్ హోమ్ లు, లాడ్జిలు నియంత్రించడం లేదు కదా? అన్న లా పాయింట్లు చాలా మంది లాగారు.
సరే ఏమయితేనేం ఇప్పుడు కోర్టు తీర్పు వెలువడింది. దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజమెంతో రేపు, ఆ తర్వాత కానీ తెలియదు. కానీ అసలు అప్పీల్ కు వెళ్లడం అవసరమా? అన్నది అనుమానం
అప్పీల్ కు వెళ్లి ప్రభుత్వం ఏం సాధిస్తుంది. జీవో 35 ను ఇంప్లిమెంట్ చేయించగలదా? అసలు కోర్టు కొట్టి వేయక ముందే జీవో 35 ను జగన్ కానీ, ఆయన మంత్రులు కానీ, ఆయన అధికారులు కానీ ఇంప్లిమెంట్ చేయించలేకపోయారు. అది వాస్తవం. కొత్త జీవో వుండగానే ఏ ఊరు అయినా, ఏ థియేటర్ అయినా, ఏ టికెట్ అయినా యూనిఫారమ్ లో 100 రూపాయలు అమ్మేసారు. కొన్ని ప్రాంతాల్లో 150 రూపాయలు అమ్మేసారు.
బయట ప్రచారం మాత్రం జగన్ టికెట్ రేట్లు కాఫీ, టీ ల రేటు కన్నా దారుణంగా తగ్గించేసాడు అని ప్రచారం. కానీ తీరా చూస్తే ఎక్కువ రేట్లే అమ్మకం. అధికారులకు జిల్లాకు 15 లక్షల వంతున ముట్టేసాయని గ్యాసిప్ లు. ఇక కొత్త జీవో తో జగన్ ఏం సాధించినట్లు?
ఇండస్ట్రీ దగ్గర చెడ్డ. థియేటర్ల దగ్గర చెడ్డ. కానీ అమ్మకాల రేట్లు మామూలే. ఇక ఇప్పుడు అప్పీల్ కు వెళ్లి ఏం సాధిస్తారు. సరే తీర్పును ఆపుతారు. లేదా అదే కంటిన్యూ అవుతుంది అనుకుందాం. అప్పుడు మాత్రం పాతిక రూపాయలకు, ముఫై రూపాయలకు టికెట్ లు అమ్మేస్తారా? అసలు జగన్ ప్రభుత్వం అలా అమ్మించగలదా? అధికారులు జగన్ కు సహకరిస్తారా?
ఎందుకొచ్చిన బ్యాడ్ నేమ్. ఎలాగూ కాగల కార్యం తీరిపోయింది. ఊరుకుంటే బెటరేమో?