బీజేపీకి శివ‌సేన వార్నింగ్!

భార‌తీయ జ‌న‌తా పార్టీకి వార్నింగ్ ఇచ్చింది శివ‌సేన‌. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌తిప‌క్ష పార్టీగా బీజేపీ కూర్చోలేక‌పోతోంద‌ని.. అంటూ శివ‌సేన అధికారిక ప‌త్రిక వ్యాఖ్యానించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని శివ‌సేన కాంగ్రెస్, ఎన్సీపీల‌తో క‌లిసి…

భార‌తీయ జ‌న‌తా పార్టీకి వార్నింగ్ ఇచ్చింది శివ‌సేన‌. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌తిప‌క్ష పార్టీగా బీజేపీ కూర్చోలేక‌పోతోంద‌ని.. అంటూ శివ‌సేన అధికారిక ప‌త్రిక వ్యాఖ్యానించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని శివ‌సేన కాంగ్రెస్, ఎన్సీపీల‌తో క‌లిసి కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో బీజేపీ గ‌రం అవుతూ ఉంది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తుతూ ఉంది క‌మ‌లం పార్టీ. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా ఏర్ప‌డిన ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని, రైతుల‌కు ఇచ్చిన హామీల అమ‌లు జ‌ర‌గ‌డం లేద‌ని బీజేపీ నేత‌, ప్ర‌తిపక్ష నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు. దీనికి సామ్నా ప‌త్రిక గ‌ట్టి కౌంట‌రే ఇచ్చింది.

గ‌తంలో అధికారం ద‌క్క‌గానే ప్ర‌తి భార‌తీయుడి ఖాతాలోకీ ప‌దిహేను ల‌క్ష‌ల రూపాయ‌లు వేస్తామంటూ మోడీ హామీ ఇచ్చార‌ని, ఆ హామీని బీజేపీ మేర‌కు నిల‌బెట్టుకుంది? అని సామ్నా ప్ర‌శ్నించింది. ఈ ప‌దిహేను ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌శ్న‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ అంత ఈజీగా స‌మాధానం చెప్ప‌లేదు. ఈ ప్ర‌శ్న‌కు బీజేపీ స‌మాధానానికి నీళ్లు న‌ములుతూ ఉంటుంది. అందుకే శివ‌సేన వాళ్లు ఈ ప్ర‌శ్న సంధించారు.

 అంతే కాద‌ట‌.. త్వ‌ర‌లోనే భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌హారాష్ట్ర విభాగంలో చీలిక వ‌స్తుందన్న‌ట్టుగా సేన హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. కొంత‌మంది బీజేపీ వాళ్లు త‌మ వైపుకు తిరుగుతారు అని శివ‌సేన అంటోంది. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీలోని కొంత‌మంది గొణుగుతూ ఉన్నారు. ఫ‌డ్న‌వీస్ వ్య‌తిరేకులు గ‌ళం విప్పుతూ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో శివ‌సేన హెచ్చ‌రిక ఆస‌క్తిదాయ‌కంగా మారింది.