వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులైతే.. మరి వీళ్లెవరు బాబు..?

చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటనకు వెళ్లినప్పుడు బస్సుపై రాళ్లు, చెప్పులు పడ్డాయి. నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఐదేళ్లు అమరావతిని పట్టించుకోలేదని వేల గొంతులు తిట్టిపోశాయి. అప్పుడు బస్సులో కూర్చున్న చంద్రబాబు.. వీళ్లంతా పెయిడ్ ఆర్టిస్ట్…

చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటనకు వెళ్లినప్పుడు బస్సుపై రాళ్లు, చెప్పులు పడ్డాయి. నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఐదేళ్లు అమరావతిని పట్టించుకోలేదని వేల గొంతులు తిట్టిపోశాయి. అప్పుడు బస్సులో కూర్చున్న చంద్రబాబు.. వీళ్లంతా పెయిడ్ ఆర్టిస్ట్ లంటూ సెటైర్ వేశారు. వైసీపీ ప్రోద్బలంతోనే తన బస్సుపై చెప్పులు విసిరారని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

రోజులు గడిచాయి, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో గుమ్మడికాయల దొంగలంతా భుజాలు తడుముకుంటున్నారు. మాజీ మంత్రులు, నేతలంతా ముందుకొచ్చి.. రైతుల పొట్టకొట్టొద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మరి ఈ నిరసనల వెనక ఉన్నవాళ్లెవరు. అప్పుడు చంద్రబాబు ఎదుట ఆందోళనలు చేసింది పెయిడ్ ఆర్టిస్ట్ లయితే, వీరంతా నేచురల్ ఆర్టిస్ట్ లా..?రాజధాని తరలించొద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని కేవలం ఓ వర్గం మీడియా మైక్ లు పెట్టగానే మహ బాగా రెచ్చిపోతున్నారు. వీరిలో ఎవరూ సామాన్య రైతులు లేరు.

వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్న వాళ్లు ఎంతమాత్రం కాదు. అంతా మోతుబరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు.అన్నిటికంటే మించి.. ఆందోళనకు దిగుతున్నవారిని సామాజిక వర్గం అనే బంధం బలంగా కలిపింది.వీరి వెనక ఉండి ఆందోళనలకు మద్దతిస్తున్నవారు కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు.

క్షేత్రస్థాయిలో ఈ ఆందోళనలను గమనించినవారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.ఇలా కొంతమందిని రెచ్చగొట్టి, మరికొంతమందిని మనకు అన్యాయం జరుగుతోందంటూ మభ్యపెట్టి ఆందోళన కార్యక్రమాలు చేయిస్తోంది టీడీపీ.ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజధాని మంట రాజేసి, చలికాచుకోవాలని చూస్తోంది. సహజంగానే ఆ వర్గం మీడియా ఈ వార్తలకు అత్యథిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో అగ్గి రాజుకుంటోంది అంటూ నానా యాగీ చేస్తోంది.