రజనీకాంత్-చిరంజీవి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి బయటపెట్టారు దర్శకుడు కేఎస్ రవికుమార్. స్నేహం కోసం సినిమా టైమ్ లో వాళ్లిద్దరూ మంచిగా మాట్లాడుకోవడం వల్లనే తన పని ఈజీ అయిపోయిందని చెప్పుకొచ్చారు.
“చిరంజీవితో స్నేహం కోసం చేయాల్సి వచ్చింది. అదే టైమ్ లో నరసింహా ఆఫర్ వచ్చింది. రజనీకాంత్ కోసం చిరంజీవి ఆఫర్ వదులుకోలేను. ఎందుకంటే అప్పటికే చిరంజీవికి మాటిచ్చాను. ఇదే విషయాన్ని రజనీకాంత్ కు కూడా చెప్పాను. వెంటనే ఆయన చిరంజీవికి ఫోన్ చేశారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. అలా స్నేహం కోసం చేయగలిగాను.”
స్నేహం కోసం సినిమాను కేవలం 45 రోజుల్లో పూర్తిచేశానని తెలిపారు కేఎస్ రవికుమార్. అదే టైమ్ లో నరసింహా సినిమాకు డైలాగ్స్ కూడా పూర్తిచేశానన్నారు. పగలు చిరంజీవి సినిమా చేస్తూనే, రాత్రిళ్లు రజనీకాంత్ సినిమాకు డైలాగ్స్ పూర్తిచేసినట్టు వెల్లడించారు. తనకు ఏ హీరోతో గొడవల్లేవంటున్నారు.
“ఏ హీరోతో నాకు ఎలాంటి అభిప్రాయబేధాల్లేవు. అందరూ మళ్లీ మళ్లీ పిలుస్తారు. కానీ నేను మాత్రం వెళ్లి ఎవ్వర్నీ అవకాశాలు అడగను. చిన్నప్పట్నుంచి నాకు అది అలవాటు. అలా అడగాలంటే నాకు సిగ్గు. అవకాశం ఇస్తే చేస్తాను. లేదంటే లేదు.”
అసిస్టెంట్ డైరక్టర్ గా పదేళ్లు పనిచేశానన్న కేఎస్.. ఆ టైమ్ లో ఏం చేయకూడదో నేర్చుకున్నానని.. చెప్పింది ఎలా తెరపైకి తీసుకురావాలో తెలుసుకున్నానని అన్నారు. అందుకే తను సినిమాల్ని ఫాస్ట్ గా తీస్తానని.. రూలర్ సినిమాను కూడా అతి తక్కువ టైమ్ లో పూర్తిచేశానని చెప్పుకొచ్చారు. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.