పవన్ వచ్చినా గాజువాక ఆయనదేనట…?

విశాఖలో గాజువాక నియోజకవర్గం 2019 దాకా ఒక సాధారణ సీటుగానే చూశారు. ఎపుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేశారో అది హాట్ సీటు అయి కూర్చుంది. పవన్ ఓడినా…

విశాఖలో గాజువాక నియోజకవర్గం 2019 దాకా ఒక సాధారణ సీటుగానే చూశారు. ఎపుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేశారో అది హాట్ సీటు అయి కూర్చుంది. పవన్ ఓడినా గాజువాకను ఈ రోజుకీ చెప్పుకుంటున్నారు.

ఎన్నికలు మరో ఏడాదిలో రాబోతున్నాయి. గాజువాక మీద మళ్లీ పవన్ కన్ను పడిందని ప్రచారం సాగుతోంది. ఈసారి తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని అంటున్నారు. పవన్ గాజువాక నుంచి పోటీకి దిగితే ఈసారి విజయం తధ్యం అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

గాజువాకకు టీడీపీ తరఫున నియోజకవర్గం ఇంచార్జిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పొత్తులలో భాగంగా పవన్ పోటీ చేస్తే మీ సంగతేంటి అంటే ఆయన డైరెక్ట్ గా జవాబు చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా ఎవరొచ్చినా తానే పోటీ చేస్తాను, తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేశారు.

అయినా ఊహాజనితమైన ప్రశ్నలు ఎందుకు అని పల్లా ఎదురు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తులు అన్నవే లేవు, పైగా ఆ మాటలూ లేవు కదా అని తెలివిగా అంటున్నారు. తన సీటు మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చూపు ఉందని అన్నా ఆయన కొట్టిపారేస్తున్నారు. 

తాను తప్ప ఎవరూ పోటీ చేయరని ఎవరి సీట్లకు వారే ఇంచార్జిలు అని ఇదే ఇపుడు సాగుతున్న విషయం అని తేల్చిచెప్పారు. పవన్ని సినిమా నటుడిగా ఎక్కువగా అభిమానిస్తాను అంటున్న పల్లా ఆయన గాజువాక వైపు చూసినా తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నట్లుగా చెబుతున్నారు అంటే గాజువాక వైపు జనసేనాని చూడకపోవడమే మంచిదేమో.