అటు మామ పవన్..ఇటు అల్లుడు సాయి ధరమ్ తేజ్..మధ్యలో శ్రీలీల డ్యాన్స్…ఎలా వుంటుంది కాంబినేషన్? అది కూడా ఓ ప్రత్యేక గీతం కోసం? పోలా..అదిరిపోలా? అన్నట్లు వుంటుంది కచ్చితంగా. ఇప్పుడు అదే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పీపుల్స్ మీడియా సంస్థ పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్-సముద్రఖని కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన పాత్ర. పక్కాగా చెప్పాలంటే నేలకు దిగి వచ్చిన దేవుడి పాత్ర.
కానీ స్క్రిప్ట్ తయారు చేసింది త్రివిక్రమ్ కదా. అందుకే దాన్ని ఎంత కమర్షియల్ చేయాలో అంతా చేసేసారు. పనిలో పనిగా పవన్-తేజ్ ల నడుమ ఓ ప్రత్యేక గీతాన్ని కూడా ప్లాన్ చేసారు. ఈ గీతంలో ఈ మామా అల్లుళ్ల మధ్యన నర్తించడానికి ఎవర్ని తీసుకోవాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఈ విషయంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల పేరు ఫస్ట్ ప్లేస్ లో వుందని తెలుస్తోంది.
ఇటీవల అదే బ్యానర్ లో ఢమాకా సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావడానికి శ్రీలీలనే కారణం. అందులో అణుమాత్రం సందేహం లేదు. తన డ్యాన్స్ లతో కుర్రకారు మతి పోగొట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వంలోని మహేష్ బాబు సినిమాలో, నిర్మాణంలోని వైష్ణవ్ తేజ్ సినిమాలో, మరో సినిమాలో కూడా శ్రీలీల నటిస్తోంది.
అంటే ఇటు వైపు అటు వైపు కూడా బెస్ట్ చాయిస్ గా వుంది. అందుకే మళ్లీ ఆమెనే స్పెషల్ సాంగ్ కు తీసుకునే ఆలోచనలు సాగుతున్నాయి. ఇది ఫిక్స్ అయితే భలేగా వుంటుంది సినిమాకు బజ్. అందులో సందేహం లేదు.