మోడీ స‌ర్కార్‌తో తండ్లాట‌కు కేసీఆర్ సై

ఏ మాట‌కామాట చెప్పుకోవాలి …మోడీ స‌ర్కార్‌ను ఢీకొట్ట‌డానికి స‌న్న‌ద్ధ‌మైన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను అభినందిం చాలి. కేంద్రానిది ప‌నికిమాలిన స‌ర్కార్ అని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. Advertisement ఆ…

ఏ మాట‌కామాట చెప్పుకోవాలి …మోడీ స‌ర్కార్‌ను ఢీకొట్ట‌డానికి స‌న్న‌ద్ధ‌మైన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను అభినందిం చాలి. కేంద్రానిది ప‌నికిమాలిన స‌ర్కార్ అని ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డానికి ఎంతో గుండె ధైర్యం కావాలి.

ఆ మాట కేసీఆర్ అన‌గ‌లిగారంటే … బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అంతేకాదు, తెలంగాణ‌లో త‌న స‌ర్కార్‌ను అస్థిర‌ప‌ర‌చ‌డానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని కేసీఆర్‌కు అనుమానం వ‌చ్చింది. అందుకే లొంగిపోయి ప్ర‌భుత్వాన్ని బీజేపీకి అర్పించ‌డం కంటే … పోరాడి నిలుపుకోవ‌డ‌మే బెట‌ర్ అనే భావ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

ప్రగతి భవన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ శ‌నివారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌, టీఆర్ఎస్ పీపీ నేత కె.కేశవరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్న స‌మావేశంలో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవల పార్లమెంటులో వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల బిల్లులకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ నుంచి పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చా ర‌ని, అలాగే చాలా మంది ప్రముఖులతో చెప్పించార‌న్నారు. అయినా రైతులు నష్టపోతారని ఆ రెండు బిల్లులకు మద్దతు ఇచ్చేం దుకు అస్సలు ఒప్పుకోలేదని కేసీఆర్ అన్నారు. 

బ‌హుశా త‌మ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన బిల్లుల‌కు కేసీఆర్ మ‌ద్ద‌తు ప‌ల‌క‌క‌పోవ‌డం … బీజేపీకి కోపం తెప్పించిన‌ట్టుంది. అందువ‌ల్లే త‌మ ప్ర‌భుత్వాన్ని మోడీ స‌ర్కార్ టార్గెట్ చేసింద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు ఆయ‌న ఆవేద‌న ప్ర‌తిబింబిస్తోంది.

త‌మ  ప్ర‌త్య‌ర్థి పార్టీలు అధికారంలో ఉన్న‌ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కుట్ర‌లు ఫ‌లించాయ‌ని,  రాజస్థాన్‌లో వారి ప్రయత్నాలు చెల్లలేదని.. మహారాష్ట్రలోనూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. 

రాష్ట్రాలను అదు పాజ్ఞల్లో పెట్టుకోవాలని కేంద్ర బీజేపీ సర్కారు చూస్తోందని.. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన కేసీఆర్‌, వారికి లొంగుతాడా? అని ప్రశ్నించారు.

కేంద్రంలో బక్వాస్‌ (పనికిమాలిన) సర్కార్‌ ఉందని.. ఆ ప్రభుత్వం చెప్పే వాటిల్లో 99 శాతం అబద్ధాలేనని కేసీఆర్ తీవ్రంగా విమ ర్శించారు.  ఇంకా పైకి చెప్పుకోలేని విధంగా కేసీఆర్ స‌ర్కార్‌పై కేంద్రం నుంచి ఒత్తిళ్లు వ‌స్తున్న‌ట్టు ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల్లో మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా విప‌క్షాలు స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తే … టీఆర్ఎస్ కూడా అనుస‌రించింది. న‌యాన్నో భ‌యాన్నో కేసీఆర్‌ను త‌మ అదుపులో పెట్టుకోవాల‌నుకున్న బీజేపీ ఎత్తుగ‌డ‌లు పార‌క‌పోవ‌డంతో … మ‌రో రూపంలో వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు కేసీఆర్ మాటల్లో ఆవేద‌న క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా నెమ్మ‌దిగా మోడీ వ్య‌తిరేక గ‌ళాలు పెరుగుతున్నాయి. దీనికి కార‌ణం మోడీ స‌ర్కార్ నియంతృత్వ విధానాలే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంటున్న దుర్ఘ‌ట‌న‌లు కూడా బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో మోడీ స‌ర్కార్‌తో గ‌ట్టిగా ఢీకొన‌డానికి కేసీఆర్ స‌ర్కార్ సై అంటోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న ఈ స్టాండ్ దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా శుభ ప‌రిణామంగా చెప్పు కోవ‌చ్చు.

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు