కొద్ది రోజుల క్రితం భవదీయుడు భగత్ సింగ్ కథ విషయంలో కొన్ని మల్లగుల్లాలు నడిచాయి. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కారణాంతరాల వల్ల తెరి రీమేక్ ను చేపట్టాల్సి వచ్చింది. దానికి టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్. కానీ ఈ వార్త బయటకు రాగానే ఆయనపై విపరీతంగా నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది. వేల కొద్దీ ట్వీట్ లు పడ్డాయి. రీమేక్ లు వద్దు కాక వద్దు అంటూ నానా హడావుడి, నానా గత్తర చేసారు. ఆఫ్ కోర్స్ ఆ తరువాత చల్లబడింది అనుకోండి.
అయితే ఇదంతా కావాలని ఎవరో హరీష్ శంకర్ కు వ్యతిరేకంగా చేయించారనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దీని కన్నా ముందే అస్సలు పవన్ స్టార్ ఇమేజ్ కు సరిపోయే మెటీరియల్ కానీ వినోదయసితం సినిమా రీమేక్ ను దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసారు. సముద్రఖని నే దర్శకుడు. అయితే ఒరిజినల్ కథను పవన్ కు అనుగుణంగా మార్చడం, స్క్రిప్ట్, మాటలు అన్నీ త్రివిక్రమ్ నే. కానీ త్రివిక్రమ్ ను ఎవ్వరూ ట్రోల్ చేయలేదు. మా హీరోకి ఇలాంటి రీమేక్ సెట్ చేస్తున్నారేంటి అంటూ ఏ విధమైన హ్యాష్ టాగ్ రెడీ చేసి, వైరల్ చేయలేదు.
అంతే కాదు, అంతకు ముందు కూడా అదే త్రివిక్రమ్ రెండు రీమేక్ లు పవన్ కోసం సెట్ చేసారు. వకీల్ సాబ్ సెట్ చేసింది ఆయనే. తెర వెనుక స్క్రిప్ట్ కరెక్షన్స్ చేసింది ఆయనే. భీమ్లా నాయక్ అయితే ఇక చెప్పనక్కరలేదు. కర్త..కర్మ..క్రియ అన్నీ త్రివిక్రమ్ నే. కానీ ఇలా మూడు రీమేక్ లు పవన్ కోసం సెట్ చేసిన త్రివిక్రమ్ ను ట్రోల్ చేయలేదు. హ్యాష్ టాగ్ లు లేవు. వైరల్ అంతకన్నా లేదు. కానీ ఒక్క సినిమా అది కూడా ఇంకా ప్లానింగ్ లో వున్న హరీష్ శంకర్ మీద విపరీతంగా నెగిటివ్ ప్రచారం నడిచింది.
ఇదంతా కేవలం పవన్-హరీష్ శంకర్ ప్రాజెక్టు ను ఆపడానికి లేదా డ్యామేజ్ చేయడానికి ఎవరో తెరవెనుక డిజిటల్ కాంపెయిన్ రన్ చేసారనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ గత మూడు నాలుగేళ్లుగా రూపాయి ఆదాయం లేకుండా వుండిపోయారని, దీనికి తెరవెనుక త్రివిక్రమ్ కు మైత్రీ తో వున్న వివాదమే కారణమని నమ్ముతున్న వారు కచ్చితంగా అనుమానపడుతున్నారు.
సినిమాలు..రాజకీయాలు రెండూ ఒకటే..ఏది ఎందుకోసమైనా జరుగొచ్చు.