అర్ఙెంట్ గా కేసు వేయండ్రా బాబూ

ఆంధ్రలో చీమ చిటుక్కు మంటే కోర్టు మెట్లు ఎక్కడం, జ‌గన్ పనులకు అడ్డం పడడం అన్నది ఓ రివాజుగా మారిపోయింది. గత రెండున్నరేళ్లుగా ఇదే తంతు. ఏమన్నా అంటే ఆ నిర్ణయాలే తప్పు అందుకే…

ఆంధ్రలో చీమ చిటుక్కు మంటే కోర్టు మెట్లు ఎక్కడం, జ‌గన్ పనులకు అడ్డం పడడం అన్నది ఓ రివాజుగా మారిపోయింది. గత రెండున్నరేళ్లుగా ఇదే తంతు. ఏమన్నా అంటే ఆ నిర్ణయాలే తప్పు అందుకే ఇదంతా అని వాళ్లు, కాదు ఇదంతా మేనేజ్ మెంట్ అని వీళ్లు. కానీ గమ్మత్తేమిటంటే బాబుగారి హయాంలో ఆయన ఏం చేసినా ఒప్పే అయింది.

అన్న క్యాంటీన్లను పసుపు రంగుతో ముంచేసినా మంచే అయింది. చంద్రన్న పథకం అంటూ పప్పుబెల్లాల్లో హెరిటేజ్ నెయ్యి యాడ్ చేసినా అడిగిన వారులేరు. అడ్డిన వారు లేరు. సరే ఆ ముచ్చట్లు అన్నీ అలా వుంచితే, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల మీద ఉప్పు, పప్పు, శెనగలు మూడు ఒక్కో కిలో వంతున జ‌నాలకు ఫ్రీగా…పక్కా ఫ్రీ గానే ఇవ్వాలని సిఎమ్ యోగి డిసైడ్ అయిపోయారు.

ఆ ప్యాకెట్ల మీద పెద్ద సైజులో మోడీ, యోగీ బొమ్మలు ముద్రించారు. ఇప్పుడు అక్కడ అవే పంపిణీ అవుతున్నాయి. అదే పని ఇక్కడ చేసి వుంటే ఫ్రీ అన్న దాని మీద ముందు సన్నాయి నొక్కులు మొదలయ్యేవి. అది చాలక, ప్రభుత్వ ధనంతో ఇస్తుంటే ఈ ఫొటోలేంటీ అని కేసులు పడిపోయి వుండేవి. యుపి లో కాదు కదా పక్కన తెలంగాణలో ఏం చేసినా మన తెలుగుదేశం పార్టీకి పట్టదు. మనది పక్కా లోకల్..పక్కాలోకల్.

ఈసారి జ‌గన్ ఏం చేసినా దానికి మోడీ ఫొటోనో, పేరునో జోడించేస్తే సరి, ఇక తెలుగుదేశం పార్టీ జ‌నాలు కిక్కురు మనే ధైర్యం చేయరు అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.