సినీ నటి స్వర భాస్కర్ పెళ్లయినప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకుంది. ఎప్పుడైతే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుందో అప్పటి నుండి ఆమెను పలువురు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచి వారి వివాహంపై తీవ్రంగా స్పందించారు.
సాధ్వి ప్రాచి మాట్లాడుతూ.. బహుశా, శ్రద్ధవాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా ఎలా నరికివేశారనే వార్తలను స్వర భాస్కర్ పట్టించుకోలేదు.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఫ్రిజ్ చూసి ఉండాల్సిందని.. పెళ్లి ఆమె పర్సనల్ ఛాయిస్.. నేను పెద్దగా చెప్పేదేమీ లేదు అంటూనే.. శ్రద్ధవాకర్‌కు జరిగినదే స్వరభాస్కర్‌కు కూడా జరగవచ్చన్నారు.
అయినదానికి.. కానిదానికి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే స్వర భాస్కర్.. వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికే గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్ ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.