పోలీస్ ఆఫీసర్..’ఉగ్రం’

ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉగ్రరూపం దాల్చితే ఎలా వుంటుంది? అసలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది? దాల్చాక ఏమైంది? ఇదే కథ..ఇదే లైన్. అని చెప్పడం కాదు. ఉగ్రం సినిమా టీజర్ చూపించేసింది. సినిమా…

ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉగ్రరూపం దాల్చితే ఎలా వుంటుంది? అసలు ఎందుకు దాల్చాల్సి వచ్చింది? దాల్చాక ఏమైంది? ఇదే కథ..ఇదే లైన్. అని చెప్పడం కాదు. ఉగ్రం సినిమా టీజర్ చూపించేసింది. సినిమా మొత్తాన్ని ఓ మినియేచర్ లా ఒడిసిపట్టింది టీజర్. నాంది సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు విజయ్-హీరో అల్లరి నరేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. సాహు గారపాటి-హరీష్ పెద్ది నిర్మాతలు.

ఈ సినిమా టీజర్ ను హీరో నాగ్ చైతన్య విడుదల చేసారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లా అల్లరి నరేష్ ను టీజర్ లో పరిచయం చేసారు. విలన్ల మీద వీరవిహారం చేసాడు. అందమైన క్యూట్ ఫ్యామిలీ అతగాడికి. అక్కడే ఏదో జరిగింది…’నా ఫ్యామిలీని టచ్ చేస్తారా’ అంటూ ఉగ్రరూపం దాల్చేసాడు. అదీ టీజర్.

ఓ సీరియస్, టఫ్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ చేయడం ఇదే మొదటిసారి. కాస్త సర్ప్రయింజ్ గానే వుంటుంది. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ చేసినా ఫన్నీగానే చేసాడు తప్ప ఇలాకాదు. రవితేజ లేదా అలాంటి హీరోలు చేసే క్యారెక్టర్ ఇది. నరేష్ ఎలా చేసాడో సినిమా చూస్తే కానీ తెలియదు. అయితే అలా అని సందేహం అక్కరలేదు. ఎందుకంటే సీరియస్ రోల్స్ లోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు నరేష్.

టీజర్ కు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. కాస్త భారీగానే ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.