ఏడ్చి సాధించిన హీరోయిన్!

ఆడవాళ్లు ఏడ్చి సాధించలేనిది ఏదీ లేదని ఓ పెద్దల మాట వుండనే వుంది. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఇలాగే ఏడ్చి ఓ చాన్స్ కొట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  Advertisement పక్కింటి నుంచి వచ్చిన…

ఆడవాళ్లు ఏడ్చి సాధించలేనిది ఏదీ లేదని ఓ పెద్దల మాట వుండనే వుంది. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఇలాగే ఏడ్చి ఓ చాన్స్ కొట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

పక్కింటి నుంచి వచ్చిన ఈ అమ్మడు ఓ పెద్ద సినిమాలో నటించిన తరువాత నుంచి, ఆ సినిమా దర్శకుడికి కాస్త దగ్గరయినట్లు విపరీతంగా గ్యాసిప్ లు వినిపించాయి. కాదు..కాదు..హీరోకి అని కూడా వినిపించాయి. మొత్తం మీద ఎవరికైనా దగ్గర కావడం అన్నది కామన్ పాయింట్. అయితే పెద్దగా కమర్షియల్ హీరోయిన్ మెటీరియల్ కాదు. అందువల్ల చాన్స్ లు మళ్లీ రావడం కష్టమే అయింది.

ఇలాంటి టైమ్ లో ఇదే డైరక్టర్ తో కాస్త సంబంధం వున్న సినిమా ప్లాన్ లోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడు వెళ్లి సదరు డైరక్టర్ దగ్గర కూర్చుని తనకు ఆ సినిమా అవకాశం ఎలాగైనా ఇవ్వాల్సిందే అని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా కన్నీళ్ల వరకు వెళ్లినట్లు బోగట్టా. దాంతో ఇక అనివార్యమై ఆ సినిమాలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడితో కన్నీళ్ల వ్యవహారం ఆగిపోతుందో, ఇక అప్పుడప్పుడు ఇలా డైరక్టర్ దగ్గర నేల తడిసిపోతూ వుంటుందో మరి. చూడాలి.