చంద్రబాబు ఇంత అమాయకంగా చెప్తే ఎలా?

జగన్మోహన రెడ్డి ప్రతిపాదతించిన మూడు రాజధానుల కాన్సెప్టు ఇంకా తుదిరూపం సంతరించుకోలేదు. జగన్ కేవలం తన ఆలోచనను మాత్రమే సభలో వెల్లడించారు. రాజధాని కోసం వేసిన కమిటీకి తాను ఎలాంటి సూచనలు చేయలేదని అన్నారు.…

జగన్మోహన రెడ్డి ప్రతిపాదతించిన మూడు రాజధానుల కాన్సెప్టు ఇంకా తుదిరూపం సంతరించుకోలేదు. జగన్ కేవలం తన ఆలోచనను మాత్రమే సభలో వెల్లడించారు. రాజధాని కోసం వేసిన కమిటీకి తాను ఎలాంటి సూచనలు చేయలేదని అన్నారు.

కానీ.. సాక్షాత్తూ ఆయన ప్రభుత్వాధినేత కాబట్టి.. ఆయన ఆలోచన కార్యరూపంలోకి వస్తుందని అనుకోవచ్చు. ఈ కాన్సెప్టును ప్రతిపక్షాలు చర్చకు పెట్టవచ్చు. కానీ చంద్రబాబునాయుడు మాటలు గమనిస్తోంటే.. ఆయన మరీ అంత అమాయకుడా అనిపిస్తోంది. నలభయ్యేళ్ల అనుభవంలో ఆయనకు అర్థమైంది అంతేనా అనిపిస్తోంది.

ప్రపోజల్స్ ప్రకారం.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని హైకోర్టు, అమరావతిలో శాసన రాజధాని శాసనసభ లెజిస్లేటివ్ రాజధాని అనేది ఆలోచన.

ఇది ప్రతిపాదన కాగా, సీఎం జగన్ ఎక్కడ కూర్చుని పరిపాలిస్తారు.. అమరావతిలోనా విశాఖలోనా? ప్రజలు మూడు ప్రాంతాలూ తిరగాలా..? అని చంద్రబాబు నిలదీస్తున్నారు! ఆయనకు ఈ కాన్సెప్టు ఎంతమాత్రం అర్థమైందో స్పష్టమైపోతోంది. ఆయనలోని అవగాహనలేమి కూడా తెలిసిపోతోంది.

హైకోర్టుతో పని ఉండేవాళ్లు మాత్రమే.. కర్నూలు వెళతారు. అమరావతిలో శాసనసభ, మండలి మాత్రమే ఉంటాయి. అసలు అక్కడకు ప్రజలు రావాల్సిన అవసరమే లేదు. నాయకులు కూడా.. సమావేశాల సమయంలో మాత్రమే అక్కడకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారు.

కార్యనిర్వాహక ఏర్పాటు అంత విశాఖలో ఉంటుంది గనుక.. మంత్రులు సీఎం అక్కడ మాత్రమే ఉంటారు. ఈ ఏర్పాటులో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వంతో పనులు పడే ప్రజలు విశాఖకే రావాల్సి ఉంటుంది.

మిగిలిన రెండు చోట్ల ప్రభుత్వం ఉండదు. అమరావతిలో కేవలం చట్టసభలు, కర్నూలులో కేవలం హైకోర్టు ఉంటాయి. ఇదంతా ఇంత క్లియర్ గా ఉండగా.. చంద్రబాబునాయుడు ఎందుకు విలపిస్తున్నాడో అర్థం కావడంలేదు.

వికేంద్రీకరణను అంగీకరించలేక.. అర్థం పర్థం లేకుండా చంద్రబాబు ఆడిపోసుకుంటున్నట్లుగా ఉంది. ఇలా చేస్తే.. ప్రజల్లో ఆయనకు ఉండే విలువ మరింత పలచన అవుతుంది.  ఆయన నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.