పవన్ కల్యాణ్ ఫక్తు మతి చలించినట్లుగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమే గానీ.. నిజానికి ప్రజలు ఆమోదించే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం, ప్రజల్ని అవమానించడమే.
అలాంటి తప్పులు అనేకం చేస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా మూడు రాజధానుల్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. అది ఆయన అజ్ఞానమో, అవగాహన లేమో అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. అర్థం పర్థం లేకుండా.. బూతు సామెతల్ని వాడుతూ.. ప్రజల్లో మరింత అసహ్యం మూటగట్టుకుంటున్నాడు.
50వేల ఎకరాల్లో రాజధాని నిర్మించడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. పైగా రాష్ట్రనికి మూడు వ్యవస్థలకు మూడు రాజధానులు ఉండడం మంచింది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తోంటే.. పవన్ కల్యాణ్ నేలబారు విమర్శలు చేయడం హేయంగా ఉంది.
‘తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తోంటే.. కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట’ ఒక అమరావతికే వనరులకు దిక్కులేకపోగా, జగన్ మూడు రాజధానులు అంటున్నాడంటూ పవన్ ఆక్షేపిస్తున్నారు. నిజానికి ఇదే వేరే అర్థంలో వాడే ఒక బూతుసామెతకు పేరడీ.
అసలు తండ్రి అనేవాడు.. తనకు తిండిలేకపోయినా.. కొడుకు అడిగితే పరమాన్నం పెట్టడానికే ప్రయత్నిస్తాడు. అందుకోసం త్యాగాలు చేస్తాడు. ఇది బిడ్డలను ప్రేమించే ఏ తండ్రులైనా అనుసరించే పద్ధతి. తనకు తిండి దొరికిన తర్వాతే.. తన కొడుకుకు తిండి పెట్టాలనేది.. బహుశా పవన్ కల్యాణ్ అనుసరించే నీచమైన జీవన సిద్ధాంతం కావొచ్చు.
ఆయనకు అంతకు మించి వేరే ఆలోచనలు రాలేవు లాగుంది. ఇంతకూ మూడు రాజధానులు అనే కాన్సెప్టే పవన్ కు అర్థమైనట్లు లేదు. నిధులు లేవు గనుకనే.. భారాన్ని గరిష్టంగా తగ్గించుకోవడానికే పవన్ ఈ ఆలోచన చేస్తున్నారు. అది అర్థం సుకోకుండా.. చెత్త సామెతలు ఏకరవు పెడితే.. గొప్ప నాయకుడు అయిపోతానని పవన్ అనుకుంటే గనుక .. అది ఆయన భ్రమ.